40ఏళ్ల ఉద్యమ ప్రస్థానం, జీవితం మొత్తం అడవికే అంకితం, కుటుంబాన్ని వదులుకున్నా, టీచర్ ఉద్యోగాన్ని వదిలేసినా, కొడుకును పోగొట్టుకున్నా, చివరికి తన ప్రాణమే పొగొట్టుకున్నా, అంతా ప్రజల కోసమే, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరుబాట పట్టాడు. ఆర్కే(అక్కిరాజు హరగోపాల్), నాలుగు దశాబ్దాల ఉద్యమ ప్రస్థానం మొత్తం ప్రజల కోసమే. ఈ నెల 14న ఉదయం 6 గంటలకు ఆర్కే అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. కిడ్నీలు విఫలమవ్వడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. 2004లో చర్చల సమయంలో ఆర్కేకు, ఇప్పటికి చాలా తేడా ఉంది. ఆయన అక్క సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చివరి చూపునైనా దక్కేలా చేసినందుకు మావోయిస్టు పార్టీకి ధన్యవాదాలు చెప్పారు ఆర్కే సోదరి. అక్టోబర్ 15, 2004న ఆయన ప్రభుత్వంతో చర్చల కోసం అడవి నుంచి బయటకు వచ్చారు. సరిగ్గా 17 ఏళ్ల తర్వాత అదే రోజు ఆయన అంత్యక్రియలు జరిగాయి.
జనం కోసమే ఎర్ర జెండా పట్టారు… చివరి క్షణం వరకు జనం కోసమే బతికారు. చివరికి జనం కోసమే మరణించారు. మొత్తం జీవితాన్నే జనానికి అంకితం చేశారు. నవ సమాజ నిర్మాణం కోసం అడవుల్లోకి వెళ్లిన ఆర్కే, చివరికి ఆ అడవుల్లోనే కలిసిపోయారు. ఆర్కే ఉద్యమ ప్రస్థానాన్ని అతని కుటుంబ సభ్యులు, విప్లవకారులు గుర్తుచేసుకుంటున్నారు. అయితే, ఆర్కే అలియాస్ అక్కిరాజు హరగోపాల్ తాజాగా మరణించడం మావోలకు కోలుకోలేని నష్టమే అంటున్నారు. ముఖ్యంగా ఏవోబీ ప్రాంతంలోని మావోలకు నైతికంగా కృంగిపోయే పరిణామంగా చూస్తున్నారు.
ఆర్కే వ్యూహాలతో ఇంతకాలం దూకుడు చేసిన మావోలకు ఆయన అనారోగ్యం పాలు కావడం విషాదమైతే ఇపుడు ఆయన లేకపోవడం భారీ లోటు అంటున్నారు. ఇక చూస్తే గత కొంతకాలంగా ఏవోబీలో మావోలకు అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయని అంటున్నారు. పోలీసులు సైతం వారి మీద పై చేయి సాధించడానికి తమ పట్టుకుని పెంచుకుంటున్న నేపధ్యం ఉంది. ఇదిలా ఉంటే ఆర్కే మరణం తరువాత మావోలు పెద్ద సంఖ్యలో జన జీవన స్రవంతి వైపుగా వస్తారని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కొర్ర కుమారి అలియాస్ శ్వేత అనే మావోయిస్ట్ నాయకురాలు పోలీసులకు లొగింపోయారు. ఆమె గత పన్నెండేళ్ళుగా మావోల ఉద్యమంలో ఉన్నారు. గాలికొండ దళంలో మిలీషియన్ సభ్యురాలిగా ఉన్న ఆమె మీద ఎన్నో కేసులు రివార్డులు ఉన్నాయి.
ఆమె లొంగుబాటు నేపధ్యంలో విశాఖ జిల్లా పోలీసులు మావోలకు మళ్ళీ పిలుపు ఇచ్చారు. జన జీవన స్రవంతిలోకి మావోలు వస్తే వారిని అన్ని రకాలుగా ఆదరిస్తామని కూడా చెప్పుకున్నారు. విశాఖ జిల్లా ఎస్పీ బి క్రిష్ణారావు మాట్లాడుతూ మావోలు సమాజంలోకి తిరిగి రావాలని, వారి సేవలను, శక్తియుక్తులను సమాజ అభివృద్ధికి ఉపయోగించి శాంతియుత వాతావరణానికి దోహపడాలని కోరారు. మొత్తం మీద చూసుకుంటే ఏవోబీలో మునుపటిలా మావోలు దూకుడు చేయగలరా అన్న సందేహాలు అయితే ఉన్నాయి. అదే సమయంలో మావోలు కూడా మరింత శక్తిని కూడదీసుకుని ముందుకు వస్తారని కూడా చర్చలు జరుగుతున్నాయి.