ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తుంది. అధికారులు కష్టపడి పని చేస్తున్నారు. దేశంలోనే తెలంగాణ ప్రభుత్వ పని తీరు సూపర్ గా ఉంది. కరోనాను కంట్రోల్ చేయటంలో మిగిలిన వారి కంటే ముందున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వాన్ని.. ప్రభుత్వంలో పని చేసే విభాగాల గురించి పాలకులు చేసే పొగడ్తలు అన్ని ఇన్ని కావు. నిజంగానే వ్యవస్థలు అంతలా పని చేస్తుంటే.. తెలంగాణ రాష్ట్ర సర్కారు రాత్రికి రాత్రి సీనియర్ ఐఏఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ అనూహ్య నిర్ణయాల్ని ఎందుకు తీసుకున్నట్లు? అన్నది ప్రశ్న.
తాజాగా పలువురు ఐఏఎస్ అధికారుల్ని బదిలీ చేయటం సంచలనంగా మారింది. ఎందుకంటే.. అందులో కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి.. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ తో పాటు పలువురు అధికారుల్ని బదిలీ చేశారు. కరోనా వేళ.. కీలకమైనస్థానాల్లో ఉన్న వారిపై బదిలీ వేటు పడటం హాట్ టాపిక్ గా మారింది.
వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న శాంతకుమారిని పెద్దగా ప్రాధాన్యత లేని అటవీ శాఖకు బదిలీ చేయగా.. వైద్య ఆరోగ్య.. కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ గా వ్యవహరిస్తున్న యోగితా రాణాను ఎస్పీ డెవలప్ మెంట్ శాఖ కమిషనర్ గా పోస్టింగ్ ఇచ్చారు. అదే సమయంలో గడిచిన ఆర్నెల్లుగా సీఎస్ నియమించిన కోర్ టీంలో పని చేస్తున్న సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీని తాజాగా వైద్యరోగ్యశాఖ కార్యదర్శిగా నియమిస్తే.. కొంతకాలంగా వెయిటింగ్ లో ఉన్న వాకాటి కరుణకువైద్య ఆరోగ్య కుటుంబ శాఖ కమిషనర్ గా పోస్టింగ్ ఇవ్వటంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.
ఇటీవల కాలంలో పెరిగిన పాజిటివ్ కేసులు.. వసతుల లేమి.. పెరిగిన మరణాలు.. ఇలా ప్రతి అంశంలోనూ ప్రభుత్వానికి విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. బదిలీ వేట్లు పడినట్లుగా భావిస్తున్నారు. వీరితో పాటు.. పలువురికి బదిలీలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కీలకమైన వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులపై బదిలీ వేటు వేయటం ద్వారా.. సర్కారు తన ఫెయిల్యూర్ ను పరోక్షంగా ఒప్పుకున్నట్లైందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.