కూతుళ్ల‌ను చంపిన పేరెంట్స్ మెంట‌ల్ కండీష‌న్‌.. డీఎస్పీ క్లారిటీ!

Update: 2021-01-26 14:30 GMT
ఏపీలోని మ‌ద‌న‌ప‌ల్లిలో ఇద్దరు కూతుళ్లను హత్య చేసిన పురుషోత్తం, పద్మజ మానసికంగా బాగానే ఉన్నారని మదనపల్లి డీఎస్పీ మనోహరాచారి తెలిపారు. మంగళవారం ఉదయం పురుషోత్తంనాయుడు, పద్మజలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంత‌రం వారిని విచారించారు. ఈ సంద‌ర్భంగా నిందితులు కీలక విషయాలను వెల్లడించారు.

అనంత‌రం మీడియాతో మాట్లాడిన డీఎస్పీ.. ప‌లు వివ‌రాలు వెల్ల‌డించారు. పురుషోత్తంనాయుడు, పద్మజ మానసికంగా బాగానే ఉన్నారని ఆయన చెప్పారు. అయితే.. ఇద్దరి మాటలు కూడా ఇంకా ఆధ్యాత్మికంగానే ఉన్నాయన్నారు. నిందితులకు వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని ఆయన చెప్పారు.

చనిపోయిన ఇద్దరు కూతుళ్లు బతికి వస్తారని  ఆ దంపతులు నమ్ముతున్నారట‌. పిల్లలన్ని చంపిన తర్వాత తాము కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకొన్నారని పోలీసుల విచారణలో తేలింది. కాగా.. నిందితులను విచారణ చేస్తున్న సంద‌ర్భంగా కొంద‌రు పోలీసులు వీడియో తీశారు. వీడియో తీయ‌డ‌మే కాకుండా.. సోషల్ మీడియాలో  పోస్టు చేశారు. వారిని సస్పెండ్ చేయాలని సిఫారసు చేసినట్టు డీఎస్పీ వెల్ల‌డించారు.
Tags:    

Similar News