తిరుమల శ్రీవారి సేవల్లో అత్యంత ఖరీదైన సేవ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇప్పటికే అనేక సేవలు.. అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు 10 వేల రూపాయల టికెట్ మాత్రమే ఉంది. మిగిలినవి 5000, 2000, 500, 300 వంటి ధరలు ఉన్నాయి. అయితే.. ఇప్పుడు వీటికి ఏమాత్రం అందని రీతిలో రూ.కోటితో ఒక వినూత్న సేవను టీటీడీ అందుబాటులోకి తీసుకురానుంది. ఇది ఉదయాస్తమాన సేవ. అంటే.. కోటి రూపాయలతో ఈ సేవాటికెట్‌ను తీసుకునే భక్తులు.. ఒకరోజు మొత్తం శ్రీవారి సేవల్లో పాల్గొనవచ్చు.
శ్రీవారికి ఉదయం నిర్వహించే సుప్రభాత సేవల నుంచి రాత్రి పవళింపు సేవ వరకు అన్నింటిలోనూ.. వీరు పాల్గొనే అవకాశం కల్పిస్తారు. ఉదయం సుప్రభాత సేవతో మొదలై.. తోమాల సేవ, కొలువు, అష్టదళ పాద పద్మారాధన, స్వామివారి అభిషేకం, వస్త్రాలంకరణ, కల్యాణోత్సవం, రథోత్సవం, తిరుప్పావై, సహస్ర దీపాలంకరణ సేవ.. చివరిగా ఏకాంత సేవ.. అలా అన్నిసేవల్లోనూ పాల్గొనే అరుదైన అవకాశం ఇది. ఈనెల 23 నుంచి ఈ ఉదయాస్తమాన సేవ ట్రయల్ రన్ మొదలవుతుంది. జనవరి రెండోవారం నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయి.
కోటి రూపాయలతో కొనుగోలు చేసే ఈ టికెట్ తో ఆరుగురు స్వామివారి ఉదయాస్తమాన సేవల్లో పొల్గొనవ చ్చు. మొత్తం 531 టికెట్లు విడుదల చేయాలని భావిస్తున్నారు. ప్రతి రోజూ టికెట్ ధర కోటి రూపాయలు, శుక్రవారం మాత్రం కోటిన్నర రూపాయలుగా నిర్ణయించారు. అయితే.. ఈ టికెట్లను పారిశ్రామిక వేత్తలు.. బిలియనీర్లు మాత్రమే ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే చాలా మంది స్వామి వారికి కోటాను కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తున్నారు. ఇప్పుడు వీరందిరికీ ఈటికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.