పాకిస్తాన్ పైలెట్ గట్టి షాకిచ్చాడు. ఏకంగా తన డ్యూటీ టైం అయిపోయిందని చెప్పి విమానాన్ని వదిలి వెళ్లిపోయాడు. పనివేళలను ఉద్యోగులు సీరియస్ గా తీసుకుంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయో తెలిపే ఈ ఘటనకు ప్రయాణికులు సాక్ అయ్యారు. ఆందోళన చేశారు.
ఒక విమాన పైలట్ అనూహ్య నిర్ణయం ఇప్పుడు ప్రయాణికులకు శాపంగా మారింది. తన డ్యూటీ టైం ముగిసిందంటూ ఓ పైలెట్ విమానాన్ని మధ్యలోనే వదిలివెళ్లిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (పీఐఏ) కు చెందిన ఆ పైలట్ విమాన ప్రయాణికులకు చుక్కలు చూపించాడు. పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ కు చెందిన పీకే9754 విమానం జనవరి 16న సౌదీ అరేబియాలోని రియాద్ నుంచి పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ కు చేరుకోవాల్సి ఉంది. అయితే మార్గ మధ్యలో వాతావరణం సహకరించక విమానాన్ని సౌదీ అరేబియాలోని దమ్మామ్ విమానాశ్రయానికి దారి మళ్లించారు.
తిరిగి విమాన ప్రయాణంకొనసాగించాల్సిన సమయానికి పైలెట్ లలో ఒకరు తన షిఫ్ట్ ముగిసిందని .. విమానం నడిపేందుకు రాలేనని తాపీగా హోటల్ కు వెళ్లిపోయాడు. కంగుతిన్న కోపైలెట్ విషయాన్ని పాకిస్తాన్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాడు.
ఇక విమానంలోని ప్రయాణికులు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ విమానం దిగబోమని.. తమ గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యత ఎయిర్ లైన్స్ దేనని పట్టుబట్టారు. ఎయిర్ పోర్టు సెక్యూరిటీ అప్రమత్తమై ప్రయాణికులకు సర్ది చెప్పారు.
అనంతరం వారందరికీ స్థానిక హోటల్ లో బస ఏర్పాటు చేసి పైలెట్ తిరిగి వచ్చాక ప్రయాణం కొనసాగించారు. దీనిపై పీఐఏ సంస్థ ప్రతినిధి స్పందిస్తూ పైలట్లకు విశ్రాంతి ఎంతో అవసరమని.. తమ పైలట్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని వెనకేసుకొచ్చింది.