షాకింగ్.. మహమ్మారికి మరిన్ని కొత్త లక్షణాలు

Update: 2020-06-29 04:30 GMT
మరో పిడుగు లాంటి వార్తగా దీన్ని చెప్పాలి. ఇప్పటివరకూ జ్వరం.. జలుబు.. గొంతు నొప్పి.. ఒళ్లు నొప్పులు.. వాసన గుర్తించే గుణం మిస్ కావటం.. ఊపిరి పీల్చుకో లేకపోవటం.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మహమ్మారి మీదకు ముంచుకొచ్చినట్లేనన్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా అంతకంతకూ పెరుగుతున్న పాజిటివ్ కేసులు కొత్త రికార్డుల్ని బద్ధలుకొడుతున్నాయి. ప్రపంచాన్ని పక్కన పెట్టి.. దేశం సంగతే చూస్తే.. తక్కువలో తక్కువగా రోజుకు ఇరవై వేల వరకు కొత్త కేసులు నమోదవుతుంటే.. ఐదు వందల మంది వరకు మరణిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సంస్థ మాయదారి రోగానికి సంబంధించిన లక్షణాలకు సంబంధించిన ఒక ప్రకటనను విడుదల చేశారు. దీని ప్రకారం ఇప్పటికే ఉన్న లక్షణాలతో పాటు.. మరిన్ని కొత్త లక్షణాలు సైతం మహమ్మారికి సంకేతాలుగా పేర్కొన్నారు. వికారం.. వాంతులు.. డయేరియా.. ముక్కు కారటం కూడా కరోనా లక్షణాలుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. కొత్తగా కనుగొన్న వాటితో కలిపి మొత్తం పదకొండు లక్షణాల్ని సీడీసీ తన అధికారిక జాబితాలో చేర్చింది.

తాను వెల్లడించిన విషయాన్ని తన అధికారిక వెబ్ సైట్లోనూ నమోదు చేసింది. వైరస్ సోకిన వారిలో రెండు రోజుల నుంచి పద్నాలుగు రోజుల్లో తాము పేర్కొన్న లక్షణాలు మహమ్మారి సోకిందనటానికి నిదర్శనంగా పేర్కొంటున్నారు. తాము పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే.. జాగ్రత్తగా ఉండటమే కాదు.. ఇంట్లోని కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఛాతిలో నిరంతరం నొప్పిగా ఉండటం.. ఒంట్లో సత్తువ లేకపోవటం.. పెదాలు లేదంటే ముఖం నీలం రంగులోకి మారటం లాంటి లక్షణాలున్నా అనుమానించాల్సిందేనని చెబుతున్నారు. సో.. బీకేర్ పుల్..
సీడీఎస్ అధికారికం గా పేర్కొన్న రోగ లక్షణాలు ఏవంటే..
- జ్వరం
- వణుకు
- దగ్గు
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు
- అలసట
- ఒళ్లు నొప్పులు
- తలనొప్పి
- రుచి చూడలేక పోవడం, వాసన పసిగట్ట లేకపోవడం
- గొంతునొప్పి
- ముక్కు కారడం
- వికారం లేదా వాంతులు
- డయేరియా
Tags:    

Similar News