స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశించినా ఆ పార్టీ నేతలు ధిక్కరించారు. స్వయాన చంద్రబాబు బామ్మర్ధి బాలయ్య హిందూపురం నియోజకవర్గంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం విశేషం. హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణకు ఆ పార్టీ నేతలు షాకిచ్చారు.
చంద్రబాబు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీచేయకుండా వైదొలిగిన సంగతి తెలిసిందే. కానీ బాబు ఆదేశాలను లెక్కచేయకుండా తెలుగు తమ్ముళ్లు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
టీడీపీకి చెందిన జడ్పీటీసీ అభ్యర్థి ఆనంద్, ఎంపీటీసీ అభ్యర్థి అశ్విణికి టీడీపీ నేతలు ప్రచారం మొదలుపెట్టారు. చంద్రబాబు బహిష్కరణ ఆదేశాలు పట్టించుకోమని హిందూపురంకు చెందిన పలువురు టీడీపీ నేతలు తెగేసి చెబుతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం నందమూరు గ్రామంలోనూ టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి వట్టూరి వెంకటరాంబాబు, ఎంపీటీసీ అభ్యర్థి పద్మ తరుఫున నేతలు ప్రచారం చేయడం విశేషం.
ఓ వైపు చంద్రబాబు ‘పరిషత్’ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటన చేయడం.. టీడీపీ నేతలు మాత్రం లోపాయికారిగా టీడీపీ అభ్యర్థులను నిలిపారని విమర్శలు వినిపిస్తున్నాయి.