మీరు చదువుతున్నది కథ కాదు నిజం. నిజంగానే నిజం. ఇలాంటిది సాధ్యమా? అన్న సందేహాన్ని కలిగించే ఈ ఉదంతంలో సూపర్ హీరోలుగా చైనా పోలీసుల్ని చెప్పాలి.
ఎందుకంటే.. వీరే ఈ అద్భుత విజయానికి కారణం. దొంగను పట్టుకునేందుకు ఇప్పటివరకుచాలానే విధానాలు విని ఉంటారు కానీ.. వీరి మాదిరి దోమల్ని పట్టుకొని.. వాటి రక్తం సాయంతో దొంగను వెతికి పట్టుకున్న వైనం ఇప్పుడు సర్ ప్రైజింగ్ గా మారింది. ఇంతకీ దొంగను దోమలు ఎలా పట్టించాయన్న విషయంలోకి వెళితే.. చైనాలోని పుజియన్ ప్రావిన్స్ లో చోటు చేసుకున్న ఈ వైనాన్ని చైనాలోని ఒక మీడియా సంస్థ ప్రచురించింది. జూన్ 11న పూజూ నగరంలోని ఒక ఇంట్లో చోరీ జరిగింది.
ఎవరూ ఇంట్లో లేనప్పుడు బాల్కనీ ద్వారా ప్రవేశించిన దొంగ విలువైన వస్తువల్ని.. డబ్బుల్ని ఎత్తుకెళ్లాడు. తన ఇంట్లో జరిగిన దొంగతనం గురించి పోలీసులకు ఇంటి యజమాని కంప్లైంట్ ఇచ్చారు.
ఫిర్యాదును తీసుకొని కేసును నమోదు చేసిన చైనా పోలీసులు.. దొంగను ఎలా అయినా పట్టుకోవాలన్న ఉద్దేశంతో పక్కా ప్లాన్ చేశారు. చోరీ జరిగిన ఇంటికి వెళ్లిన పోలీసులు.. అక్కడి పరిసరాల్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో కిచెన్ లో నూడుల్స్.. కోడిగుడ్డు షెల్స్ ను పోలీసులు గుర్తించారు. అంటే.. రాత్రి వేళలో దొంగ కిచెన్ లో ఎక్కువ సేపు ఉన్నట్లుగా గుర్తించారు. బెడ్రూంలో రెండు దోమలు చనిపోయి ఉండటాన్ని గుర్తించారు.
దీంతో ఆ దోమల రక్తాన్ని సేకరించిన పోలీసులు.. ఆ దోమలు ఆ దొంగ రక్తాన్ని పీల్చి ఉంటాయని నమ్మారు. నిజానికి దొంగను దోమలు కుట్టి ఉంటే.. అతడు ఆ దోమల్ని కొట్టి చంపి ఉంటారని పోలీసులు అంచనా వేశారు. ఆ వెంటనే.. దోమల రక్తాన్ని సేకరించిన క్లూస్ టీం.. డీఎన్ ఏ పరీక్షల కోసం ల్యాబ్ కోసం పంపారు. పోలీసుల అంచనా నిజం కావటంతో వారు కేసును మరింత వేగంగా విచారణను చేపట్టారు.
దోమల రక్తంలోని డీఎన్ ఏను గుర్తించి.. దాని రికార్డు చేసి క్రిమినల్ రికార్డ్స్ లో వెతికారు. చివరకు ‘చై’ అనే వ్యక్తితో రక్తంలోని డీఎన్ ఏ మ్యాచ్ అయ్యింది. దీంతో.. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి దోమల్ని నిర్దాక్షిణ్యంగా చంపిన దొంగ మీద దోమలు తమ ప్రాణాలు విడుస్తూనే.. దొంగ దొరికేలా చేశాయని చెప్పక తప్పదు.