తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లిన వారికి గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్రపతి

Update: 2022-12-11 04:30 GMT
రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ ప్రాంతం నుంచి ఏపీకి వెళ్లిన వారికి గుడ్ న్యూస్ చెప్పారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. విభజనలో భాగంగా ఏపీక వెళ్లిన వారికి సంబంధించి విద్య.. ఉద్యోగాలకు సంబంధించిన స్థానికత అంశం కీలకం కావటం తెలిసిందే. అలాంటి సమస్యలు ఎదురు కాకుండా ఉండేందుకు వీలుగా ఏపీకి వెళ్లిన వారికి స్థానికతను కల్పిస్తూ అప్పట్లో ఆదేశాలు జారీ చేశారు.తాజాగా ఆ గడువు ముగిసిన పరిస్థితి.

ఇలాంటి వేళ.. మరోసారి ఆ ఆదేశాల్ని మరో మూడేళ్లు పొడిగిస్తూ తాజాగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఆదేశాలపై ఆమె సంతకం చేశారు. దీంతో.. విభజన నేపథ్యంలో తెలంగాణ నుంచి ఏపీకి తరలి వచ్చిన వారికి విద్య.. ఉద్యోగాలకు సంబంధించి ఏడేళ్ల పాటు స్థానికత కల్పిస్తూ 2014లో అప్పటి రాష్ట్రపతి ఆమోదముద్ర వేసి.. ఆదేశాలకు తాజాగా మరో మూడేళ్ల పాటు కొనసాగనున్నాయి.

దీనికి సంబంధించిన గెజిట్ ను కేంద్రం తాజాగా జారీ చేసింది. విద్యా సంస్థల్లో ప్రవేశాలకు.. స్థానికత లభించేందుకు వీలుగా 1974 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల్ని సవరణ చేశారు. అదే సమయంలో ఉద్యోగాలకు సంబంధించిన స్థానికతకు 1975 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణలు చేశారు.

ఈ రెండింటికి సంబంధించిన విభజన వేళ తెలంగాణ ప్రాంతంలో నివాసం ఉండి.. ఏపీకి తరలివచ్చిన వారందరికి స్థానికత మరో మూడేళ్లు వర్తించేలా తాజా ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో.. తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన వారికిదో తీపికబురుగా చెప్పాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News