భారత్ ప్రపంచంలోనే ఏడో అతిపెద్ద దేశం. జనాభాలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన ఐదో దేశం. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. శరవేగం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటి. 2030 నాటికి భారత్ ఆర్థిక వృద్ధి అభివృద్ధి చెందిన దేశాలను సైతం మించిపోతుందని, భారత్ ప్రపంచంలోనే ఒక శక్తిగా ఎదుగుతుందని పలు సర్వేలు, నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
అయినప్పటికీ దేశం నుంచి ఇతర దేశాలకు వలస వెళ్లిపోయేవారి సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. సాధారణంగా ఒక దేశంలో జీవించడానికి మంచి అవకాశాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, విద్య, వైద్య సదుపాయాలు, ప్రశాంతత, ఎలాంటి హింస లేకపోవడం వంటివి కారణాలుగా ఉంటాయి. ఇవన్నీ మనదేశంలో ఉన్నాయి. అయినప్పటికీ ఇతర దేశాలకు వెళ్లి అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకునేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
గతేడాది 1.63 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకొని విదేశాలకు వలస వెళ్లిపోయారని గణాంకాలు వివరిస్తున్నాయి. ఇందులో 78 వేల మందికి పైగా అమెరికా పౌరసత్వాన్ని స్వీకరించారని తెలుస్తోంది. మిగిలిన వారు ఇతర అభివృద్ధి చెందిన దేశాలైన ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, ఇటలీ వంటి దేశాల్లో స్థిరపడ్డారు.
వాస్తవానికి ఇండియాలో ద్వంద్వ పౌరసత్వం లేదు. ఏక పౌరసత్వం మాత్రమే ఉంది. అంటే వేరే దేశ పౌరసత్వాన్ని ఎవరైనా స్వీకరిస్తే ఆటోమేటిక్‌గా భారత పౌరసత్వాన్ని కోల్పోతారు.
గత ఐదేళ్లలో 6.70 లక్షల మంది దేశాన్ని శాశ్వతంగా విడిచి వెళ్ళిపోవడం గమనార్హం. ఇటీవల రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్రమే ఈ సమాచారాన్ని వెల్లడించింది. ఇలా విదేశాలకు వెళ్లిపోతున్న వాళ్లలో ధనవంతులు, విభిన్న రంగాల్లో నిపుణులే అత్యధికంగా ఉంటున్నారని చెబుతున్నారు.
లండన్‌కి చెందిన గ్లోబల్ సిటిజన్ అండ్ రెసిడెన్స్ అడ్వైజర్ సంస్థకు అనుబంధమైన 'హెన్లీ అండ్ పార్ట్‌నర్స్' అధ్యయనం తాజాగా బాంబుపేల్చింది. భారత్‌లో అత్యధిక సంపద కలిగిన వ్యక్తులు సుమారు ఎనిమిదివేల మంది ఈ ఏడాదిలో భారతదేశ పౌరసత్వం వదిలిపెట్టనున్నారని సంచలన నివేదిక విడుదల చేసింది. సంపన్నులు, విభిన్న రంగాల నిపుణులు తర్వాత దేశాన్ని వదిలిపెట్టేవారిలో మేధావులు, వివిధ వృత్తి నిపుణులు ఉన్నారని నివేదిక పేర్కొంది.
మనదేశంలో వివిధ అంశాల్లో సానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ విచ్చలవిడి అవినీతి, ప్రతిభకు తగ్గ గుర్తింపు, వేతనాలు లభించకపోవడం, విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యం, సామాజిక అస్థిరతలు, అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే తీసికట్టుగా ఉన్న జీవన ప్రమాణాలు వంటి కారణాలతో భారతీయులు ఇతర దేశాలకు వలస పోతున్నారు.
కోవిడ్ సృష్టించిన కల్లోలంతో చాలామందికి ఉద్యోగాలు పోయాయి. మరోవైపు యూరోపియన్, అమెరికన్ దేశాల్లో చాలా దేశాల్లో యువ జనాభా తక్కువగా ఉంది. ఆయా రంగాల్లో నిష్ణాతులైన నిపుణుల కొరత ఉంది. ఈ నేపథ్యంలో ఆ దేశాలు నిపుణుల కోసం అన్వేషిస్తున్నాయి. అందులోనూ భారతీయులకు పెద్దపీట వేస్తున్నాయి. భారతీయులకు ఉన్న సహనం, అంకిత భావం, తక్కువ వేతనాలకైనా పనిచేయగల స్వభావం, ఇంగ్లిష్ భాషను అనర్ఘలంగా మాట్లాడటగలగడం విదేశాలను ఆకట్టుకుంటున్నాయి. అదేవిధంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్ (యూఏఈ), సింగపూర్ వంటి దేశాల్లో పన్నుల భారం కూడా తక్కువే. దీంతో సంపన్నులు పన్నులు తక్కువ ఉన్నచోటకు, ప్రశాంతత ఉండే దేశాలకు వలసపోతున్నారు.
ప్రశాంతమైన వాతావరణం, ఉన్నతస్థాయి జీవన ప్రమాణాలు, కాలుష్యం తక్కువగా ఉండటం, ఉగ్రవాద భయం అంతగా లేకపోవడం, మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, అత్యధిక వేతనాలు పశ్చిమ దేశాలవైపు భారతీయులు మొగ్గు చూపేలా చేస్తున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాలు ఇటీవల వీసాల నిబంధనలను సైతం సడలించాయి. దీంతో భారతీయులకు మంచి అవకాశం లభించింది.
ఇలా వివిధ రంగాల నిపుణులు, సంపన్నులు దేశం వదిలి విదేశాలకు వెళ్లిపోతే దేశానికి నష్టమని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో 130 కోట్ల మంది ఉన్న జనాభాలో కొన్ని లక్షల మంది వెళ్లిపోయినంతమాత్రాన దేశానికి వచ్చే నష్టమేమీ లేదని తేల్చిచెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.