మాంద్యం దెబ్బ.. బంగారం అమ్మేస్తున్నారా?

Update: 2019-11-04 11:15 GMT
ఆర్థిక మాంద్యంతో దేశం అతలాకుతలం అవుతోంది. ఈ నేపథ్యంలో పారిశ్రామిక రంగాలకు కేంద్రం ఎన్ని ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించినా ఆర్థిక వ్యవస్థ కుదుటపడడం లేదు. దీంతో భారత దేశం తన వద్దనున్న బంగారం నిల్వలను అమ్మడానికి సిద్ధమైందనే వార్త బయటకు వచ్చింది.

ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం నిల్వలు గల తొలి పది దేశాల్లో భారత్ ఒకటి. ప్రపంచ బంగారం మండలి (డబ్యూజీసీ) వివరాల ప్రకారం ప్రపంచంలోనే 8,133.5 టన్నుల బంగారం నిల్వలతో అమెరికా తొలి స్థానంలో ఉంది. ఇక తర్వాత రెండో స్థానంలో జర్మనీ 3366 టన్నులు, ఐఎంఎఫ్ వద్ద 2814 టన్నులు, ఇటలీ వద్ద 2451.8 టన్నులు బంగారం నిల్వలున్నాయి. ఆ తరువాత ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, జపాన్ లు ఉన్నాయి. భారత్ వద్ద 618.2 టన్నుల బంగారం నిల్వలున్నాయి. బంగారం నిల్వలు అధికంగా గల దేశాల్లో ప్రపంచంలో టాప్ 10వ స్థానంలో భారత్ కొనసాగుతోంది.

అయితే ప్రపంచంలోనే విదేశీ మారక నిల్వలుగా బంగారాన్ని దాచిన అతిపెద్ద దేశం అమెరికానే.. అమెరికా వద్ద 76.9శాతం బంగారం నిల్వలు ఉన్నాయి. ఇదే అతిపెద్ద నిల్వ కేంద్రం. ఇక భారత్ వద్ద మాత్రం బంగారం నిల్వల వాటా కేవలం 6.9శాతం మాత్రమే.

ఆర్టీఐ తాజాగా బంగారంను అమ్మడానికి పెట్టిందని వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బంగారమే ఆర్థిక మాంద్యానికి విరుగుడు అని దాన్ని అమ్మడం లేదని ఆర్బీఐ వివరణ ఇచ్చింది.
Tags:    

Similar News