మే 23కి ముందే చంద్రబాబు చెంతకు ఫలితాలు

Update: 2019-04-27 16:30 GMT
ఎన్నికల ఫలితాల కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు ఫలితాల తేదీకి ముందే దాదాపుగా ఒక స్పష్టమైన అంచనాకు వచ్చేలా, ఫలితాలను అర్థం చేసుకునేలా పక్కా ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాలవారీగా టీడీపీకి ఎన్ని ఓట్లు వచ్చాయి.. ఎన్ని సీట్లు గెలవబోతున్నామన్నది తెలుసుకునేందుకు ఇప్పటికే వివిధ మార్గాల్లో సమాచారం తెప్పించుకున్న చంద్రబాబు ఇప్పుడు మరో సమాచారం కూడా తెప్పించుకున్నారట. ఆ సమాచారాన్ని మొత్తం క్రోడీకరించాక వేసవి విడిది నుంచి వచ్చాక చంద్రబాబు వాటిని పరిశీలించి గెలుస్తామా లేదా అన్నది స్పష్టమైన అంచనాకు రానున్నట్లు తెలుస్తోంది.
        
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాల స్థాయిలో జరిగిన పోలింగ్ లెక్కలు, అక్కడున్న మొత్తం ఓటర్లు... వాళ్లలో టీడీపీకి అనుకూలంగా ఓట్లు వేసినవాళ్లు... ఈ వివరాలన్నీ వెంటనే పంపాలని ఆయా నియోజకవర్గాల అభ్యర్థులకు మరోసారి ఆదేశాలిచ్చారు చంద్రబాబు.  సాధారణంగా ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఉన్న మొత్తం ఓటర్లు, పోలైన ఓట్ల వివరాల్ని తెలుసుకునేందుకు ప్రిసైడింగ్ అధికారి... 17సీ ఫారంను పోలింగ్ ఏజెంట్లకు ఇస్తారు. ప్రస్తుతం చంద్రబాబు ఆ ఫారంలను తనకు పంపాలని అభ్యర్థులను కోరుతున్నారు. ఈ ఫారంల వల్ల... పోలైన ఓట్లలో తమకెన్ని పడ్డాయో ఆయా పార్టీలు అంచనా వేసుకునేందుకు వీలవుతుంది. అందుకే చంద్రబాబు ఆ ఫారంల కోసం పదే పదే అడుగుతున్నారని తెలిసింది.
    
ఇప్పటికే వీటి ప్రాతిపదికన కుప్పం నియోజకవర్గంపై పూర్తి నివేదిక చంద్రబాబుకు చేరిందట. కీలకమైన మిగతా నియోజకవర్గాల నుంచీ ఇలాంటి రిపోర్టులు సిద్ధమవుతున్నాయట ఇప్పుడు. వారం రోజుల్లో ఆ నివేదికలు అన్నీ తెప్పించుకొని... వాటి ద్వారా టీడీపీకి కచ్చితంగా ఎన్ని ఓట్లు వస్తాయో లెక్కలేస్తారని తెలుస్తోంది. ఒకవేళ మెజార్టీ సీట్లు రావని భావిస్తే పొత్తుల అంశాలపై వ్యూహాలు సిద్ధం చేస్తారట.


Tags:    

Similar News