విశాఖపట్నం లో కీలకమైన నియోజకవర్గం గాజువాక. గత ఎన్నికలకు ముందు వరకు ఈ నియోజకవర్గం గురించి... రాష్ట్రంలో ఎవరూ పెద్దగా చర్చించుకునే పరిస్థితి రాలేదు.కానీ, 2019 ఎన్నికల్లలో మాత్రం ఈ నియోజకవర్గం రెండు తెలుగు రాష్ట్రాలను ఆకర్షించింది. దీనికి ప్రధాన కారణం.. ఇక్కడ నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేయడమే! అప్పటి వరకు అన్ని నియోజకవర్గాలతో సమానంగానే దీనిని కూడా భావించారు. అయితే.. పవన్ ఎప్పుడైతే.. ఇక్కడ నుంచి నామినేషన్ వేశారో.. అప్పుడు ఈ నియోజకవర్గంపై చర్చ జోరుగానే సాగింది.
ఇక, ఈ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. అయితే.. గత ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందని అందరూ అనుకున్నారు. వైసీపీ, టీడీపీ, జనసేనల మధ్య పోటీ ఉంటుందని.. భావించినా.. ప్రధానంగా వైసీపీ వర్సెస్ జనసేనగా ఇక్కడి పోటీ మారిపోయింది. ఈక్రమంలో మూడు సార్లు అప్పటికే ఓటమి చవిచూ సిన.. వైసీపీ నాయకుడు తిప్పల నాగిరెడ్డిఇ.. ఏకంగా పవన్‌పై విజయం దక్కించుకున్నారు. దీనికి ఆయనపై ప్రజలకు ఉన్న సింపతీతోపాటు.. వైసీపీ అధినేత జగన్ చేసిన పాదయాత్ర .. పార్టీ సునామీ వంటివి అన్నీ కలిసివచ్చాయి.
అయితే.. తిప్పల నాగిరెడ్డి గెలిచి రెండున్నరేళ్లు గడుస్తున్నా.. గాజువాకలో ఎక్కడా అభివృధ్ది కనిపించడం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. అంతేకాదు.. కేవలం తన కుటుంబ రాజకీయాల కోసమే ఆయన గెలిచినట్టు ఇక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు. తిప్పల నాగిరెడ్డికి ఇద్దరు వారసులు ఉన్నారు. వీరిని నేరుగా రాజకీయాల్లోకి తీసుకువచ్చిన.. ఆయన..వైసీపీలో మంచి పదవులు ఇప్పించుకున్నారు. ఒకరిని ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో కార్పొరేటర్‌గా గెలిపించుకున్నారు. మరొకరిని నామినేటెడ్ పదవిలో కూర్చోబెట్టుకున్నారు.
పోనీ.. వారసత్వ రాజకీయాలు కామనే కనుక.. ఆయన అలా చేశారని అనుకున్నా.. ప్రజలను పూర్తిగా పక్కన పెట్టడం మాత్రం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి కూడా పరిస్థితి ఇలానే ఉంటే కష్టమనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇదే విషయంపై వైసీపీలోనూ చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో తనకుమారుడికి టికెట్ ఇప్పించుకునేందుకు ఉబలాటపడుతున్న నాగిరెడ్డి.. నియోజకవర్గాన్ని వదిలేస్తే.. ఎలా? అనే ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి.
ఈ పరిణామం.. అసలుకే ఎసరు తేవడం ఖాయమని అంటున్నారు.ఇక్కడ చిత్రం ఏంటంటే.. పార్టీ హవా తగ్గిపోతోంది. నాగిరెడ్డి..తనను గెలిపించిన పార్టీ నేతలను కూడా పట్టించుకోవడం లేదు. దీంతో వారు కూడా నైరాశ్యంలో ఉన్నారు. ఈ పరిణామాలు.. గాజువాకలో వైసీపీని ఇబ్బంది పెట్టడం ఖాయమని..వ చ్చే ఎన్నికల్లో కనుక పవన్ పోటీ చేస్తే..ఖచ్చితంగా ఆయన గెలిచి తీరుతారని అంచనా వేసస్తున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.