కాంగ్రెస్ లో అసమ్మతిపై శివసేన స్పందించింది. రాహుల్ గాంధీ నాయకత్వానికి చరమగీతం పాడేందుకే సీనియర్ నేతలు కుట్రపూరితంగా లేఖ రాశారని ఆరోపించింది. కాంగ్రెస్ కు మద్దతుగా శివసేన పార్టీ పత్రిక సామ్నాలో సంపాదకీయం రాశారు.
రాహుల్ గాంధీపై చవకబారు వ్యాఖ్యలు, దాడులు చేసినప్పుడు వీరంతా ఎక్కడున్నారని శివసేన ఆరోపించింది. రాహుల్ నాయకత్వాన్ని తుదముట్టించేందుకే వీరు కుట్రపూరితంగా వ్యవహరించారని ఆరోపించింది.
పాతకాపులంతా కలిసి రాహుల్ గాంధీని వెన్నుపోటు పొడిచారని.. బీజేపీ తలపెట్టని హాని సైతం వీరు రాహుల్ కు తలపెట్టారని దుయ్యబట్టింది.
లేఖ రాసిన 23 మంది కాంగ్రెస్ సీనియర్లు చాలామంది గాంధీ, నెహ్రూ కుటుంబాల అండతో ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులై ఇప్పుడు వెన్నుపోటు పొడిచారని ఘాటుగా విమర్శించింది.