పోలీసులనే బురుడి కొట్టించిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని

Update: 2021-05-25 06:30 GMT
తప్పు .. చిన్నదైనా , పెద్దదైనా తప్పే. తప్పు చేస్తే ఈ రోజు తప్పించుకోవచ్చు కానీ, ఎదో ఒక రోజు చేసిన తప్పుకి ప్రతి ఫలం అనుభవించాల్సిందే. చేసిన తప్పు నుంచి తప్పించుకోవటం అసాధ్యం. ఇదే మరోసారి నిజం అయ్యింది.  తాజాగా ఆ విషయం మరోసారి ఫ్రూవ్ అయ్యింది. ఒక పెద్ద కంపెనీలో టీం లీడర్ గా పని చేసే మహిళ విలాసాల మోజులో ఎంత దారుణానికి దిగిందో తెలిస్తే షాక్ అవుతారు. పోలీస్ కానిస్టేబుల్ ను జైలుకు పంపిన ఆమె , తాజాగా చేసిన పాపం పండి తనూ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితిని వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే .. హైదరాబాద్ లోని నాగోలుకు సమీపంలోని బండ్లగూడకు చెందిన 33 ఏళ్ల ఓ మహిళా నగరంలోని  ఒక కంపెనీలో టీం లీడరుగా పని చేసేవారు. దీనితో అప్పట్లో ఆమెకి మంచి జీవితం వచ్చేసింది. ఖరీదైన జీవితం ఆమెకు అలవాటైంది. విలాసాల మోజులో కూరుకుపోయింది. అయితే , కరోనా  కారణంగా ఆమె జాబ్ పోయింది. ఒక జిమ్ లో ఏఆర్ కానిస్టేబుల్ తో పరిచయమైంది. కట్ చేస్తే  అతడికి పెళ్లైందన్న విషయాన్ని దాచి పెట్టి తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఈ కంప్లైంట్ తో అతన్ని జైలుకు పంపారు. ఇదిలా ఉంటే , సదరు కానిస్టేబుల్ భార్యతో పాటు, ఇతర కుటుంబ సభ్యులకు చెందిన నకిలీ ప్రొఫైల్స్ తో ఇన్ స్ట్రా, ఫేస్ బుక్ ఖాతాల్ని క్రియేట్ చేసింది. అభ్యంతరకర సందేశాలు, అసభ్య మెసేజ్ లు పంపటం షురూ చేసింది. ఈ టార్చర్ భరించలేని కానిస్టేబుల్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ జరిపిన పోలీసులు ఈ మొత్తం వ్యవహారానికి కారణం ఆ మహిళనే తేల్చారు. దీనితో తాజాగా ఆమెను అరెస్ట్ చేశారు.
Tags:    

Similar News