విభజన జరిగి దాదాపు ఏడేళ్లు కావొస్తోంది. ఎవరి పాలన వారు చేసుకుందామని అనుకొని విడిపోయిన తర్వాత.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారం ఏళ్లకు ఏళ్లు సాగటం దేనికి నిదర్శనం. కేంద్రం నుంచి ఇవ్వాల్సినవి ఏపీకి ఇప్పటికి రాలేదన్నది నిజం. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఏపీ అడిగిన 32 అంశాల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రియాక్టు కాకపోవటం గమనార్హం.
విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాలు పరిష్కరించుకోవాల్సిన అంశాలు బోలెడన్ని ఉన్నాయి. వీటిల్లో పలు అంశాలపై ఏపీ ప్రభుత్వం తన వంతుగా తన అభిప్రాయాల్ని కేంద్రానికి పంపేసింది. కేంద్రం సైతం తన బాధ్యతగా.. ఆయా అంశాలపై తెలంగాణ ప్రభుత్వాన్ని సమాధానాలు ఇవ్వాల్సిందిగా కోరింది. కానీ.. తెలంగాణ నుంచి ఎలాంటి సమాధానాలు రాని వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇదే విషయాన్ని మరెవరో చెబితే నమ్మలేని పరిస్థితి. లోక్ సభలో కేంద్రమంత్రి స్వయంగా.. సభాముఖంగా స్పస్టం చేశారు. సమస్యల పరిష్కారంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ ప్రశ్నిస్తుంటారు. అలాంటప్పుడు కేంద్రం అడిగిన అంశాలపై కేసీఆర్ సర్కారు ఎందుకు స్పందించదు? తన అభిప్రాయాల్ని ఎందుకు వెల్లడించదు? అన్నది అసలు ప్రశ్న. దీనిపై చర్చ వచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పడేలా వ్యాఖ్యలు చేస్తుంది.
అంతే తప్పించి.. తాము అడిగిన అంశాలకు సమాధానాలు ఎందుకు ఇవ్వటం లేదన్న మాట కేంద్రం నుంచి వస్తే.. తెలంగాణ సర్కారుకు చురుకు పుట్టే వీలుంది. కానీ.. అలాంటిదేమీ కనిపించదు. తాను ఎప్పుడైనా ఇరుకున పడితే.. దాని నుంచి తప్పించుకోవటానికి తెలంగాణ సర్కారు స్పందించటం లేదన్న మాటను తెర మీదకు తీసుకురావటమే తప్పించి.. రెండు తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారంపై కేంద్రానికి చిత్తశుద్ధి ఉన్నట్లుగా కనిపించదు. ఇంతకీ.. ఏపీ స్పందించిన అంశాలపై తెలంగాణ సర్కారు ఎందుకు స్పందించదన్నది అసలు ప్రశ్న.