చలికాలంలో ఉదయం పది గంటలు దాటిన చాలా ప్రాంతాల్లో మంచు దుప్పటి కనిపిస్తూనే ఉంటుంది. పల్లెల్లో ఉదయాన్నే లేచే వారంతా చలిమంటలు వేసుకోవడం కన్పిస్తుంది. పట్టణాల్లో అయితే ఆఫీసు వెళ్లే వారు మినహా మిగతా వారంతా పది అయ్యేదాకా పక్కమించి దిగరనే చెప్పవచ్చు. చలికాలంలో ఎదుట వచ్చే వాహనాలు కన్పించకపోవడంతో ట్రాఫిక్ సమస్యలతోపాటు వాహన ప్రమాదాలు అనేకం జరుగుతూ ఉంటాయనే సంగతి తెల్సిందే.
అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం చలి ఉష్ణోగ్రతలు -50 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. మామూలు రోజుల్లో కంటే చలి కాలంలో ధృవ ప్రాంతాల్లో.. మంచు ప్రాంతాల్లో నివసించే వారి పరిస్థితి మరింత అధ్వానంగా మారుతుంది. ఆయా ప్రాంతాల్లో ఆహార పదార్థాలు.. మంచినీళ్లు సైతం మంచులో గడ్డ కట్టే పరిస్థితులు ఉంటాయి. దీంతో మంచినీళ్లు తాగాలన్న సరే ముందుగా మంచును కరిగించి ఆ తర్వాత నీటిని సేవించాల్సి ఉంటుంది.
ప్రపంచంలో మైనస్ 50 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న ప్రాంతాలు చాలానే ఉన్నాయి. అయితే రష్యాలోని సైబీరియా ప్రాంతంలో మాత్రం ఉష్ణోగ్రతలు మరింత దారుణంగా పడిపోతున్నాయి. ఈ ప్రాంతంలో అత్యల్పంగా మైనస్ 62.4 డిగ్రీలు లేదా మైనస్ 80.9 డిగ్రీల ఫారెన్ హిట్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తాజాగా వెల్లడించారు. రష్యాలో 2002 తర్వాత నుంచి నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇవే కావడం విశేషం.
అదేవిధంగా రష్యాలోని యాకుట్స్క్ నగరంలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో మైనస్ 62 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలకు పడిపోవచ్చని వాతావరణ శాఖ అప్రమత్తం చేస్తోంది.
సాధారణ రోజుల్లో ఈ ప్రాంతంలో -40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మాసాల్లో మంచుగాలుల కారణంగా ఈ ఉష్ణోగ్రతలు మరింత దిగజారుతున్నాయి. ఈ ప్రాంతాల్లో 3 లక్షలకు పైగా జనాభా నివసిస్తున్నారు.
ఈ ప్రాంతంలో నివసించడం చాలా కష్టం. ఇక్కడి ప్రజలు చలికాలంలో క్యాబేజీ వంటి పొరలతో కూడిన దుస్తులు ధరించడం వంటివి చేస్తుంటారు. బట్టల పైన బట్టలు వేసుకుని చలి నుండి తమను తాము రక్షించుకునే ప్రయత్నం చేస్తారు. మైనస్ ఉష్ణోగ్రత కారణంగా వీరికి చేపలను ఉంచడానికి ఫ్రిజ్ కూడా అవసరం ఉండదు. మాట్లాడటం శ్వాస తీసుకోవడం చలి కాలంలో కష్టం అవుతుంది.
ఈ కాలంలో పని చేయడం కూడా కష్టంగా మారుతుంది. అయితే చేపలు అమ్ముకోవడానికి ఇల్లు గడవడానికి మాత్రం వీరంతా తప్పనిసరిగా బయటికి రావాల్సి ఉంటుంది. అయితే బయటికి వస్తే మనుషులు గడ్డ కట్టుకు పోయేంత చలి ఈ ప్రాంతంలో ఉంటుంది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మాత్రం ఈ ప్రాంతంలోని వారంతా తగు జాగ్రత్తలు తీసుకోక తప్పదు.. లేదంటే మాత్రం మనుషులపై ఇక ఆశలు వదులుకోవాల్సిందే..!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.