కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ఇచ్చిన షాక్ నుంచి చాలా దేశాలు ఇంకా కోలుకోలేదు. రానున్న కొద్ది రోజుల్లో మూడో వేవ్ మొదలు కానుందన్న హెచ్చరికలు మొదలయ్యాయి. దీనికి సంబంధించిన పలు జాగ్రత్తలు.. సూచనలు ఇప్పటికే పలు సంస్థలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ థర్డ్ వేవ్ విరుచుకుపడకుండా ఉండటానికి ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతోంది. ముఖ్యంగా ఆగ్నేయ ఆసియా దేశాలకు తాజాగా కొన్ని సూచనలు చేసింది.
ముఖ్యంగా మాల్దీవులు.. మయన్మార్ లో ప్రమాదకర వేరియంట్లు విస్తరిస్తున్నాయని.. బంగ్లాదేశ్.. భారత్.. ఇండోనేషియా.. నేపాల్.. శ్రీలంక.. థాయ్ లాండ్ తదితర దేశాల్లో ఇలాంటి వేరియంట్లు భారీ నష్టాన్ని కలిగించిన విషయాన్ని గుర్తు చేసింది. ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వాలు కరోనా నియంత్రణ చర్యల్ని పట్టించుకోవటం లేదని పేర్కొంది. ఆంక్షలు సడలించటంతో ప్రజలు కూడా పట్టించుకోవటం లేదని పేర్కొంది. ఇలాంటి వాటి వల్లే పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతాయని చెప్పింది.
డబ్ల్యూహెచ్ వో ఏమేం చెప్పిందన్నది చూస్తే..
- థర్డ్ వేవ్ విరుచుకుపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజారోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు పెంచుకోవాలి
- కరోనా నియంత్రణ చర్యల్ని సమర్థంగా అమలు చేయాలి. వ్యాక్సినేషన్ లో వేగం పెంచాలి
- టెస్టు.. ట్రేస్.. ఐసోలేషన్ విషయంలో ప్రయత్నాల్ని నిరంతరం కొనసాగించాలి
- సామాజిక దూరం.. చేతులు శుభ్రపర్చుకోవటం.. మాస్కులు సక్రమంగా ధరించటం తప్పనిసరి
- ప్రమాదకర వేరియంట్లు విస్తరిస్తున్న ప్రాంతంలో ఏ మాత్రం అజాగ్రత్త పనికిరాదు
- ఆగ్నేయ ఆసియాలో.. భారత్ లో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది
- మహమ్మారి మన చుట్టుపక్కలే ఉందన్న విషయాన్ని ఎవరూ మరవొద్దు
- వైరస్ జయించామన్న అతి విశ్వాసం అసలు పనికి రాదు