వైరల్ గా కేసీఆర్ నాటి వ్యాఖ్యలు వీడియో.. ఏపీని అంతలా తిట్టారా?

Update: 2022-12-24 05:40 GMT
‘‘ఆంధ్రాలో పుట్టినోళ్లందరూ తెలంగాణ ద్రోహులే. తెలంగాణను దోచుకోవటానికి చూసేటోళ్లే’’ ‘‘ఆంధ్రా కుక్కల్లారా 24 గంటల్లో ఖాళీ వెళ్లండి.. లేదంటే వెళ్లగొడతామన్నా’’ ‘‘అసలు మీ ముఖానికి బిర్యానీ వండటం వస్తదా? పెంటలా ఉంటుంది’’ ‘‘కేసీఆర్ మీకు ఉలవలు తెలుసా అన్నాడు.. మాకు ఎందుకు తెలీదు ఎడ్లకు పెడతామన్నా’’ ‘‘నువ్వు ఎద్దువో.. దున్నపోతువో నువ్వే ఆలోచించుకో.. నేను ఎందుకు చెప్పాలి?’’ ‘‘కండ కావరమా? అహంకారమా? ఎందుకు మాట్లాడతావు ఇట్లా? లంకలో పుట్టినవన్నీ రాక్షసులే.. వీడు అదే మాట్లాడతాడు.. వాడు అదే మాట్లాడతాడు’’ ‘‘ఎవడి సొమ్ము ఎవడు తింటుండు.. ఎవరి నీళ్లు ఎవరు తాగుతుండు?’’ ‘‘ఎతక్కపోయినోడ్ని ఏమంటారు దొంగ అంటారు.. పట్టి పీడిస్తున్నోడ్ని ఏమంటారు పిశాచి..రాక్షసి అంటారు’’ ‘‘ఇన్ని తిట్టినా.. ఇన్ని అన్నా.. సిగ్గు లేకుండా.. రోషం ఉన్నోడు పడతాడా? ఇన్ని తిట్టినాక.. ముఖం మీద ఉమ్ము ఊసినా ఉంటామంటే ఏమనాలి?’’
‘‘ఇజ్జత్ ఉన్నోడైతే బండ కట్టుకొని బావిలో దూకాలి’’

ఈ మాటల్ని ఎవరు ఎవర్ని అన్నారు? ఆంధ్రప్రదేశ్ నాయకుల్ని అన్నారా? ఏపీ ప్రజల్ని అన్నారా? లాంటి విషయాన్ని వీడియోను మరోసారి వింటే ఎవరికి వారికి ఇట్టే అర్థమవుతుంది. తెలంగాణ ఉద్యమం పేరుతో ఏపీ ప్రజల మీద ఇష్టారాజ్యంగా నోరు పారేసుకున్న కేసీఆర్ మాటలకు నిదర్శనంగా ఈ వ్యాఖ్యలు నిలుస్తాయి. అదేమంటే.. తాను అన్నది ఏపీ పాలకుల్నే తప్పించి ఏపీ ప్రజల్ని కాదన్న మాట కేసీఆర్ నోటి నుంచి తరచూ వినిపిస్తూ ఉంటుంది. తన పుష్కర ఉద్యమ ప్రయాణంలో కేసీఆర్ అన్న మాటలు.. చేసిన పొగరబోతు మాటలకు కొదవ లేదు.

ఇన్ని మాటలు అనేసి.. తెలంగాణ సాధన తప్పించి తనకేం వద్దన్న ఆయన.. ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ పేరుతో కొత్త రాజకీయ దుకాణాన్ని తెరవటమే కాదు.. నోటికి వచ్చినట్లుగా మాటలు అనేసిన గడ్డ మీద తన పార్టీ ఆఫీసు తెరవటాన్ని ఏపీ ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి. ఇన్ని మాటలు అన్న తర్వాత కూడా కేసీఆర్ భుజానికి భుజం రాసేసి.. ఏపీ ప్రయోజనాల కోసం.. ఏపీ భవిత కోసం కేసీఆర్ తో కలిసి పని చేస్తామనే వారిని ఏమనాలి? ఎలా చూడాలి?

రాజకీయ ప్రయోజనాలు తప్పించి ఇంకేం ఉండదన్నట్లుగా వ్యవహరించే ధోరణి కేసీఆర్ కు కొత్తేం కాదు. తాను తిట్టిన తిట్లకు ఇజ్జత్ ఉన్నోళ్లు అయితే బండ కట్టుకొని దూకి చావాలన్న కేసీఆర్.. ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలు.. ఆయన్ను.. ఆయన కుటుంబ సభ్యులపై ఎంతటి దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి.. అన్నేసి మాటలు..తిట్లు తిట్టించుకుంటున్న ఆయన.. గతంలో తాను అన్న మాటల్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది.
రాజకీయ ప్రయోజనాల కోసం ఏపీతో పాటు.. దేశ వ్యాప్తంగా పార్టీని విస్తరించాలని భావిస్తున్న  ఆయనకు తమిళులు ఎలా రియాక్టు అవుతారు? అన్నది ప్రశ్నగా మారింది. ఎందుకంటే గతంలో ఆయన లంకలో పుట్టినోళ్లంతా రాక్షసులే అన్న ఘాటు వ్యాఖ్య చేసిన నేపథ్యంలో.. ఆ రాష్ట్రంలో అడుగు పెట్టిన నాడు ఆ మాటల్ని గుర్తు చేసుకునే అవకాశం ఉందంటున్నారు.

ఇక.. ఏపీ విషయానికి వస్తే.. ఉద్యమ వేళలో సెంటిమెంట్ ను అడ్డు పెట్టుకొని నోటికి ఎంత మాట పడితే అంత మాట అనేసిన కేసీఆర్.. ఇప్పుడు ఏపీ ప్రజల గురించి.. వారి ప్రయోజనాల గురించి.. వారి బాగోగుల గురించి ఎలా మాట్లాడతారు? అన్నది ప్రశ్నగా మారింది. ఏపీ గురించి మాట్లాడటానికి ముందు.. వైరల్ గా మారిన వీడియోకు.. ఆ వీడియోలో ఉన్న వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది. మరి.. ఈ వీడియోకు సమాధానం చెప్పే ధైర్యం చేస్తారా? అన్న మాట వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View



Tags:    

Similar News