కాలం మారింది. అభిరుచులు మారాయి. గతంలో ప్రేమ వివాహాలే సంచలనంగా మారేవి. ఆ తర్వాతి కాలంలో అమ్మాయి మరో అమ్మాయిని పెళ్లాడటం.. అబ్బాయి.. మరో అబ్బాయిని పెళ్లాడే రోజులు వచ్చేశాయి. వీరి డిమాండ్లకు ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు సైతం ఓకే చెప్పేసి..అలాంటి పెళ్లిళ్లను చట్టబద్ధం చేశాయి. ఇదిలా ఉంటే..
తాజాగా బయటకు వచ్చిన ఒక పెళ్లి ఉదంతం పెను సంచనలంగా మారటమే కాదు..ప్రపంచ వ్యాప్తంగా అందరిని ఆకర్షిస్తోంది. దీనికి కారణం.. రెండు దేశాలకు చెందిన మిస్ బ్యూటీలు రహస్యంగా పెళ్లి చేసుకోవటమే. తమ రిలేషన్ ను తాజాగా ఒక వీడియోతో అధికారికం చేసిన వైనం సంచలనంగా మారింది. కోట్లాది మంది మనసుల్ని దోచేసే అందం ఉన్న ఈ ఇద్దరు బ్యూటీలు.. ఒకరినొకరు ఇష్టపడి పెళ్లాడి హాట్ టాపిక్ గా మారారు. ఇంతకూ ఆ ఇద్దరు ఎవరంటే..
2020 మిస్ అర్జెంటీనాగా నిలిచారు మెరియానా. అదే ఏడాది మిస్ ప్యురెటో రికో గా కిరీటాన్ని సొంతం చేసుకున్నారు ఫాబియోలా వాలెంటిన్. వీరిద్దరు అదే ఏడాది జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీల్లో తొలిసారి కలుసుకున్నారు. ఎక్కడ వారిద్దరు కనెక్టు అయ్యారన్న విషయాన్ని రివీల్ చేయనప్పటికీ.. ఈ ఇద్దరు మంచి స్నేహితులుగా మారారు. వారిద్దరు కలిసి ఉమ్మడిగా ఒక ఇన్ స్టా పేజీ స్టార్ట్ చేసి సమ్ థింగ్ స్పెషల్ గా నిలిచారు. కానీ.. ఎవరికి వారిద్దరి మధ్య ఏదో ఉందన్న అనుమానం కలుగకుండా జాగ్రత్త పడ్డారు.
తొలుత స్నేహితులుగా.. ఆ తర్వాత వారిద్దరి మధ్య లవ్ ఎపైర్ సీక్రెట్ గా నడిచింది. తాజాగా వారిద్దరు అక్టోబరు 28న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరికి సంబంధించిన ఒక క్యూట్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో.. వీరిద్దరి బంధం ప్రపంచానికి తెలిసిపోయింది.
ఇప్పటివరకు తమ రిలేషన్ ను సీక్రెట్ గా ఉంచామని.. ఇకపై అందరికి చెప్పాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతూ.. తమకు అక్టోబరు 28 ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు. తమ మధ్య ఉన్న అనుబంధాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపిస్తూ.. విడుదల చేసిన ఈ వీడియోలో ఈ ఇద్దరు ముద్దులు పెట్టుకంటూ.. చూడముచ్చటగా ఉన్న ఈ పెయిర్ ఇప్పుడు సమ్ థింగ్ స్పెషల్ అన్నట్లు మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.