ఆరు త‌ర్వాత అధికారిక కార్య‌క్ర‌మాలు ఉండ‌వు..జ‌గ‌న్ నిర్ణ‌యం

Update: 2019-06-01 05:13 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆస‌క్తిక‌ర నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. శుక్ర‌వారం సీఎస్ ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యంతో పాటు.. ప‌లు శాఖ‌ల అధికారుల‌తో సుదీర్ఘంగా చ‌ర్చ‌లు జ‌రిపిన ఆయ‌న‌.. కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ప్ర‌స్తుతం అమ‌ల‌వుతున్న టెండ‌రింగ్ విధానంలోనూ మార్పుల గురించి చ‌ర్చ‌లు జ‌రిపారు.

పాల‌న‌లో పూర్తి పార‌ద‌ర్శ‌క‌త తీసుకురావ‌టం.. కింది స్థాయి నుంచి పై వ‌ర‌కూ వ్య‌వ‌స్థ‌లో అన్ని వ‌ర్గాల్లోనూ సంపూర్ణంగా ప్ర‌క్షాళ‌న చేయాల‌న్న ప‌ట్టుద‌ల‌తో యువ సీఎం ఉన్నారు. ప్ర‌పంచ బ్యాంకు చెప్పిన ప్రొక్యూర్ మెంట్ చ‌ట్టంలోని అంశాల్ని అధ్య‌య‌నం చేయాల‌ని కోరారు. కాంట్రాక్ట‌ర్ల‌తో సంప్ర‌దింపులు జ‌రిపే విధానానికి స్వ‌స్తి ప‌ల‌కాల‌ని.. అందుకు త‌గ్గ‌ట్లు కొత్త టెండ‌రింగ్ విధానం ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్ర‌భుత్వ ఉద్యోగుల ప‌ని వేళ‌ల మీద మ‌రోసారి స్ప‌ష్ట‌త ఇచ్చారు. ఉద‌యం 10.30 గంట‌ల నుంచి సాయంత్రం5.30 గంట‌ల వ‌ర‌కు అధికారులు.. ఉద్యోగులు ప‌ని చేస్తే స‌రిపోతుంద‌ని చెప్పారు. సెల‌వు రోజుల్లో విధులు నిర్వ‌ర్తించాల్సిన అవ‌స‌రం లేద‌న్న ఆయ‌న‌.. సాయంత్రం ఆరు గంట‌ల త‌ర్వాత అధికారిక కార్య‌క్ర‌మాలు ఏమీ ఉండ‌వ‌ని చెప్పేసిన జ‌గ‌న్‌.. ఆ స‌మ‌యంలో ప్ర‌భుత్వ ఉద్యోగులు ప‌ని చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌ని తేల్చేశారు. ఒక‌వైపు పాల‌న సంస్క‌ర‌ణ‌లు.. మ‌రోవైపు ఉద్యోగుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న జ‌గ‌న్ తీరు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News