ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు శుక్రవారం టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఏపీ అసెంబ్లీలో పెరిగిన ధరలపై టీడీపీ సభ్యులు బాదుడే బాదుడు పేరుతో నినాదాలు చేశారు. ఈ క్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారం పోడియంను చుట్టుముట్టారు. దీంతో స్పీకర్ తమ్మినేని ఒకరోజు పాటు టీడీపీ సభ్యులను శాసన సభ నుంచి సస్పెండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు బయటకు వెళ్లడానికి ఇష్టపడకపోవడంతో వారిని మార్షల్స్ ద్వారా బలవంతంగా బయటకు తోసివేయించారు.
నిత్యావసర ధరలపై టీడీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. పెరిగిన చార్జీలు, పెరిగిన పన్నులపై చర్చించాలని టీడీపీ పట్టుబట్టింది. దీంతో సభలో గందరగోళ పరిస్థితి చోటు చేసుకుంది. దాంతో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. "బాదుడే బాదుడు" అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ తమ్మినేని వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. 13 మంది టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయినవారిలో ఉన్నారు.
కాగా శాసనసభలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ మండిపడ్డారు. "టీడీపీ సభ్యుల తీరును ప్రజలు గమనించాలి. అసెంబ్లీ అంటే టీడీపీకి గౌరవం లేదు. ఎప్పుడూ ఇదే విధంగా వ్యవహరిస్తోంది. తోటి సభ్యుల హక్కులను కాలరాస్తోంది. మీకు ప్రతిరోజు ఇదొక అలవాటుగా మారింది. మీ దుష్ప్రవర్తనకు మిమ్మల్ని ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తున్నా. ప్రతి రోజు ఇదొక వ్యాపకం అయిపోయిందా మీకు? ఇంతకంటే వ్యాపకం లేదా మీకు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"ఫుల్ దెమ్ అవుట్" అంటూ మార్షల్స్‌కు ఆదేశాలు జారీ చేశారు. స్పీకర్ తీరుపై టీడీపీ సభ్యులు నిప్పులు చెరిగారు. మార్షల్స్‌తో ఎలా బయటకు పంపుతారంటూ ప్రశ్నించారు. దీనితో స్పీకర్ స్పందిస్తూ "దె ఆర్ మార్షల్స్ ఆస్ ద స్పీకర్ అయామ్ డిక్లేరింగ్.. వన్స్ అయామ్ డిక్లేర్ యు షుడ్ నాట్ టేక్ ఎనీ మోర్ హియర్. తీసుకెళ్లండి" అంటూ మార్షల్స్‌ను స్పీకర్ తమ్మినేని సీతారం ఆదేశించారు.
అసెంబ్లీ ప్రవర్తన నియమావళి సబ్ రూల్ 2 ప్రకారం.. టీడీపీ ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవానీ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చిన్నరాజప్ప, జోగేశ్వరరావు, పయ్యావుల కేశవ్, మంతెన రామరాజు, అనగాని సత్యప్రసాద్, డోలా బాలవీరాంజనేయులు, వెలగపూడి రామకృష్ణ, గొట్టిపాటి రవికుమార్‌లు ఒక రోజుపాటు సస్పెండ్ అయ్యారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.