రాజకీయాల్లో చాలా జరుగుతున్నాయి. ఒక విధంగా చెప్పాలీ అంటే ఎన్నో విమర్శలు అటూ ఇటూ చెడుగుడు ఆడుతున్నాయి. గట్టి పోటీ రాజకీయ పార్టీల మధ్య ఉంటే ఎలా ఉంటుంది అనడానికి ఏపీ ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి. ఏపీకి చంద్రబాబు అవసరం లేదు అని ఏకంగా చివరాఖరు పంచ్ ని పేల్చేశారు రోజా.
వేయి మాటలు లక్ష పంచులు కోటి సెటైర్లు అసలు ఇవన్నీ ఎందుకు. ఏపీకి బాబు అవసరం లేదు. ఇదొక్కటే మాట. తారక మంత్రం లాంటి మాట. ఇదే పవర్ ఫుల్ స్లోగన్ లాంటి మాట. ఇది వైసీపీ కనిపెట్టిన మాట. అందుకే ఫైర్ బ్రాండ్ రోజా మినిస్టర్ రోజాగా ఫస్ట్ టైమ్ బాబు మీద బిగ్ సౌండ్ చేశారు.
చంద్రబాబు అవసరం ఏపీకి ఏముందని ఆయన అంటున్నారు. బాబు లాంటి వారు అవసరం లేనే లేదు అంటూ ఆమె కొత్త భాష్యం చెప్పేశారు. బాబుకు జగన్ కి పోలిక ఏంటి అని కూడా మండిపడ్డారు. ఇదంతా విజయవాడలో జరిగిన సామూహిక అత్యాచారం ఘటన మీద టీడీపీ, చంద్రబాబుకు రోజా మార్క్ రిటార్ట్ అన్న మాట.
రోజా ఈ రోజు ఈ మాట అన్నారు కానీ దీనికి కొద్ది రోజుల ముందే ప్రభుత్వ సలహా దారు సజ్జల రామక్రిష్ణా రెడ్డి అయితే అసలు రాజకీయాలకు బాబు అవసరం ఉందా అన్న అర్ధం వచ్చేలా మాట్లాడారు. బాబుకు ఏ దేవుడూ దేవతల అనుగ్రహం ఉండరాదు అని తాను కోరుకుంటున్నట్లుగా ఆయన చెప్పేశారు.
ఏపీకి బాబు మళ్లీ సీఎం అవాల్సిన పరిస్థితి కానీ అవసరం కానీ లేనే లేదని తేల్చేశారు. మొత్తానికి బాబు మీద ఇంతకాలం రకరకాలైన విమర్శలు చేస్తూ వచ్చిన వైసీపీ వారు ఇపుడు బాబూ మీకో దండం మీ అవసరం మాకు లేదు, ఏపీకి లేదు, రాజకీయాలకు అంతకంటే లేదు అంటున్నారు అంటే ఇంతకంటే పెద్ద విమర్శ ఉంటుందా.
అంటే బాబుతో ఇక మాటల యుద్ధం అవసరమే లేదు. ఆయన రాజకీయాలు తమకు వద్దంటే వద్దు అని చెబుతున్నారన్నమాట. మరి టీడీపీ వారు ఏమైనా తక్కువ తింటారా. అసలు ఊరుకుంటారా. వారు కూడా మాకు జగన్ వద్దు అంటారేమో. మొత్తానికి ఎవరు ఎవరిని వద్దనుకున్నా అసలు తీర్పు చెప్పాల్సింది జనాలు, వారికి ఎవరు కావాలీ ఎవరు వద్దు అన్నది 2024 ఎన్నికల్లో తేలుస్తారు. అప్పటివరకూ ఈ మాటల యుద్ధాలు సాగుతూ ఉండాల్సిందే మరి.