జేఎన్ యు ఘటన, సీఏఏ పై దేశంలో వెల్లువెత్తిన నిరసనలతో సహా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల పై కాంగ్రెస్ ఆధ్వర్యాన సోమవారం ప్రతిపక్షాల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరు కావలసిందిగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆయా విపక్షాలకు లేఖలు రాశారు. అయితే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఆప్, మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ, మహారాష్ట్ర లోని శివసేన ఈ సమావేశానికి హాజరు కావడంలేదని ప్రకటించాయి.
ఈ మీటింగ్‌కి తమకు ఆహ్వానం అందలేదని, అందువల్ల తాము రావడంలేదని సేన వర్గాలు వెల్లడించాయి. ఇక రాజస్తాన్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వానికి తాము బయటినుంచి మద్దతు తెలిపామని, అయితే రెండోసారి కాంగ్రెస్ నేతలు మా పార్టీవారిని తమ పార్టీలో చేరాల్సిందిగా కోరారని మాయావతి తెలిపారు. ఇది అనైతికమని ఆమె ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ఎలా హాజరవుతామని ఆమె ప్రశ్నించారు. అయితే సీఏఏ, ఎన్నార్సీలకు మేం వ్యతిరేకమన్నారు. ఇక సీఏఏకి నిరసనగా కోల్‌కతాలో జరిగిన భారత్ బంద్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తమను చిన్నచూపు చూసిందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కాగా, ఈ సమావేశానికి ఎన్సీపీ, డీఎంకే, ఐయుఎంఎల్, లెఫ్ట్, ఆర్జేడీ వంటి పార్టీలు హాజరవుతున్నాయి. అయితే, విపక్షాలు ఎన్ని చేసినా సరే ..పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తామని కేంద్రం స్పష్టం చేస్తుంది. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అని తెలిపింది.