కంటికి కనిపించని వైరస్.. బ్యాక్టీరియాలు మానవాళికి పెను సవాళ్లు విసురుతూనే ఉన్నాయి. 2020 ఏడాది ప్రారంభంలో కరోనా వైరస్ ప్రపంచానికి పరిచయమైంది. ఈ మహమ్మరి వల్ల యావత్ ప్రపంచం కొన్నినెలల పాటు స్తంభించిపోయింది. సైంటిస్టుల కృషి ఫలితంగా కరోనాకు వ్యాక్సిన్ రావడంతో ప్రస్తుతం కోవిడ్ ముందు ఉన్నటువంటి పరిస్థితులు తిరిగి నెలకొంటున్నాయి.
ఇక 2019 వరకు కూడా బ్యాక్టీరియా మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి. కరోనా రాకతో బ్యాక్టిరియా మరణాలపై ఎవరూ కూడా పెద్దగా ఫోకస్ పెట్టలేదు. అయితే ప్రపంచవ్యాప్తంగా మరణాలకు రెండో అతిపెద్ద కారణం బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్స్ అని లాన్సెట్ అధ్యయనం వెల్లడైంది. 2019లో 1.37 కోట్ల మంది వివిధ వ్యాధులతో మరణించగా వీరిలో 77 లక్షల మంది బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్స్ తో మృతి చెందినట్లు తేలింది.
ఈ 77 లక్షల మంది మృతికి 33 బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్స్ కారణం కాగా వీటిలో ఐదు బ్యాక్టీరియాలు మాత్రమే సగానికి పైగా మరణాలకు కారణమైనట్లు లాన్సెట్ అధ్యయనంలో తేలింది.
వీరిలో 75శాతం శ్వాసకోశ ఇన్ ఫెక్షన్లు.. బ్లడ్ స్ట్రీమ్ ఇన్ ఫెక్షన్లు.. పెరిటోనియల్.. ఇంట్రా అబ్డామినల్ ఇన్ ఫెక్షన్లతో మరణించినట్లు వెల్లడైంది. అలాగే ఎస్. అరియస్. ఈ కోలి.. ఎస్ న్యూమోనియా.. కే.. న్యూమోనియా.. పీ ఎరుగినోసా బ్యాక్టీరియాలతో 54.2 శాతం మృతిచెందినట్లు లాన్సెట్ అధ్యయనంలో తేలింది.
ఇక భారత్ లో ఎక్కువగా ఈ కోలి.. ఎస్ న్యూమోనియా.. కె. న్యూమోనియా.. ఎస్ ఆరియస్.. ఏ. భౌమాని అనే ఐదు రకాల బ్యాక్టిరియల్ ఇన్ ఫెక్షన్స్ తో సుమారు 6.8లక్షల మంది మృతి చెందారని వెల్లడైంది. వీటిలో అత్యధికంగా ఈ కోలి బ్యాక్టిరియాతో 1.57లక్షల మంది మృతి చెందారని లాన్సెట్ అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ తర్వాత బ్యాక్టీరియల్ మరణాలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
2019లో ఎస్. అరియస్ బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్లతో 10 లక్షల మంది మరణించగా ఆ తర్వాత స్థానంలో ఈ కోలి బ్యాక్టిరియల్ మరణాలు ఉన్నాయని పేర్కొంది. 15 ఏళ్లకు పైబడిన వారిలో ఎస్. ఆరియస్ బ్యాక్టీరియల్ మరణాలు ఎక్కువగా ఉంటే 5 నుంచి 14 ఏళ్ళ లోపు చిన్నారుల్లో సాల్మొనెల్ల ఎంటెరికా సెరోవర్ టైఫీ మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయని లాన్సెట్ తన అధ్యయనంలో పేర్కొంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.