వైసీపీనే నమ్ముకొని బతికారు.. అధినేత వైఎస్ జగన్ వెంట నడిచారు. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. కానీ సామాజిక సమీకరణాల్లో వారికి మంత్రి పదవి దక్కలేదు. మొదటిసారి మిస్ అయ్యింది.. మరి రెండోసారి చాన్స్ వస్తుందా? లేదా అన్నది ఆ నేతలు కలలుగంటున్నారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ కు విజయనగరం జిల్లా అండగా నిలిచింది. తొమ్మిదికి తొమ్మిది స్థానాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఆ మేరకు కేబినెట్ బెర్త్ లు వస్తాయని జిల్లా వాసులు అనుకున్నట్లే డిప్యూటీ సీఎంతోపాటు కీలకమైన మున్సిపల్ శాఖని సైతం జిల్లాకే కట్టబెట్టారు. మంత్రివర్గంలో బొత్స సత్యనారాయణ.. పాముల పుష్ప శ్రీవాణి చోటు సంపాదించారు.
జిల్లాకు కీలక పదవులు రావడం వరకూ బాగానే ఉన్నా.. ముగ్గురు సీనియర్లు మాత్రం మొండిచెయ్యే మిగిలిందట.. కొలగట్ల వీరభద్రస్వామి, రాజన్నదొర, బొబ్బిలి రాజులను ఓడించిన శంభంగి వెంకట చిన అప్పల నాయుడు మంత్రి పదవి ఆశించారు. జిల్లా నేతలు కూడా ఈ ముగ్గురిలో ఒకరికి కేబినెట్ బెర్త్ ఖాయమనుకుంటున్నారు.
తాజాగా ఇద్దరు మంత్రులు రాజ్యసభకు వెళుతుండడంతో జిల్లా సీనియర్లు ఆశలు పెంచుకుంటున్నారు. తమకు తప్పకుండా తమను పరిగణలోకి తీసుకుంటారని ఆశిస్తున్నారు.
ఇందులో విజయనగరం ఏజెన్సీలో కీలక నేతగా ఉన్న రాజన్నదొరకు ఈసారి తప్పకుండా పిలుపు వస్తుందని భావిస్తున్నారు. కొలగట్ల సైతం ఇదే ఆశలు పెట్టుకున్నారు. సామాజిక సమీకరణాల వల్ల వీరిద్దరికీ చాన్స్ ఉంటుందని ప్రచారం సాగుతోంది.