టీడీపీ లో ఆ ఇద్దరు ఫెయిల్... బాబు సైడ్ చేసేస్తారా..?

Update: 2022-01-08 14:30 GMT
గత ఎన్నికల్లో భారీ ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీలో అనూహ్య మార్పులు జరుగుతూ వస్తున్నాయి. ఎక్కడకక్కడ చంద్రబాబు పార్టీలో మార్పులు చేసుకుంటూ వస్తున్నారు. పార్టీని మళ్ళీ బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీలో సరికొత్త మార్పులు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీలో ఎప్పుడూలేని విధంగా పార్లమెంట్ అధ్యక్షులని నియమించారు. జిల్లా అధ్యక్షులని తీసేసి.. పార్లమెంట్ స్థానాల వారీగా అధ్యక్షులని పెట్టారు. ఇది ఏడాదిన్నర క్రితమే పెట్టారు.

దీని వల్ల మరింత ఎక్కువగా నేతలు పనిచేస్తారని, పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలే ఉంటాయి కాబట్టి... ఇంకా ఎక్కువగా పనిచేయడానికి వీలు అవుతుందని ఇలా చేశారు. 25 పార్లమెంట్ స్థానాలకు 25 మంది అధ్యక్షులని పెట్టారు. అయితే మొదట్లో అందరు అధ్యక్షులు సరిగ్గా పనిచేయలేదు. చాలామంది వైసీపీకి భయపడి వెనుకడుగు వేశారు. కానీ కొంతమంది దూకుడుగా పనిచేస్తూ వచ్చారు. ఇక నిదానంగా వారిని చూసి మిగిలిన వారు కూడా యాక్టివ్‌గా పనిచేయడం మొదలుపెట్టారు.

ఇప్పుడు అందరు యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం బాగానే కష్టపడుతున్నారు. తమ స్థానాల్లో పార్టీ పుంజుకునేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ పార్లమెంట్ అధ్యక్షుల్లో కొందరు..తమ తమ స్థానాల్లో పార్టీని బాగానే పికప్ అయ్యేలా చేశారని చెప్పొచ్చు. కానీ కొందరు మాత్రం ఫెయిల్ అవుతున్నారు. ఇంకా వారు దూకుడుగా పనిచేయాల్సి ఉంటుంది.

అలా ఫెయిల్ అవుతున్న వారిలో చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఉన్నారు. చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు పులివర్తి నాని, తిరుపతి అధ్యక్షుడు నరసింహ యాదవ్‌లు అంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. మామూలుగా చిత్తూరులో వైసీపీ డామినేషన్ ఉంది. అలాంటప్పుడు వీరు ఇంకా ఎక్కువ కష్టపడాలి. కానీ వీరు మాత్రం అంత దూకుడు మాత్రం పనిచేస్తున్నట్లు కనిపించలేదు. దీంతో వారి స్థానాల్లో ఉండే అసెంబ్లీ స్థానాల్లో కూడా టీడీపీ పుంజుకున్నట్లు కనిపించడం లేదు. ఈ ఇద్ద‌రిని బాబు త‌ప్పించేస్తార‌న్న టాక్ కూడా పార్టీ వ‌ర్గాల్లో వ‌చ్చేసింది.
Tags:    

Similar News