ఏపీలోని కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని చల్లపల్లి మండలంలోని బీసీ హాస్టల్ అది. సోమవారం అర్ధరాత్రి ఏం జరిగిందో తెలియదు. ఓ 3వ తరగతి విద్యార్థి హాస్టల్ బాత్ రూంలో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. గొంతు కోసి ఉంది. మృతుడిని దాసరి ఆదిత్య (8)గా గుర్తించారు. మంగళవారం టాయిలెట్ కు వెళ్లిన విద్యార్థులు గుర్తించడంతో ఈ విషయం వెలుగుచూసింది. ఆదిత్యను చూసి షాక్ తిన్న తోటి విద్యార్థులు హాస్టల్ వార్డెన్ చెప్పడంతో పోలీసులకు సమాచారం అందింది.
పోలీసులు చుట్టుపక్కలా డాగ్ స్క్వాడ్ తో విచారణ చేపట్టారు. ఆదిత్య మెడపై కత్తితో కోసినట్లుగా ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. విద్యార్థి ప్రమాదవశాత్తు మరణించాడా? ఎవరైనా హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మెడపై కత్తిగాటు ఉండడంతో బాలుడిని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
చర్లపల్లి నారాయణ నగర్ కు చెందిన ఆదిత్యతో పాటు అతడి అన్న కూడా ఇదే హాస్టల్ లో ఉంటున్నారు. రోజూ ఇద్దరూ పక్కపక్కనే పడుకుంటారు. అయితే ఆదిత్య సోమవారం రాత్రి అన్న గదికి రాలేదు. పక్కగదిలో పడుకోవచ్చని అన్న భావించి ఊరుకున్నాడు. ఉదయం చూసే సరికి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. హాస్టల్ కు చేరుకున్న ఆదిత్య తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమకు ఎలాంటి ఆస్తి - ఇతర గొడవలు లేవని పోలీసులకు చెప్పారు.
పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. బాలుడిని హత్య చేయాల్సిన అవసరం ఏమై ఉంటుందన్న విషయంపై ఆరాతీస్తున్నారు. ఏ క్లూ దొరకపోవడంతో బాలుడు ఎలా చనిపోయాడన్నది మిస్టరీగా మారింది.