ఓవ‌ర్ రియాక్ష‌న్ కూడా ముప్పే.. వైసీపీలో హాట్ టాపిక్..‌!

Update: 2021-04-26 02:30 GMT
``అధికారంలో ఉన్నాం.. ఇప్ప‌టికే రెండేళ్లు గ‌డిచిపోయాయి. మ‌రో మూడేళ్లు మాత్ర‌మే స‌మ‌యం ఉంది. ఇందులోనూ చివ‌రి ఏడాది ఎన్నిక‌ల సీజ‌న్‌.. సో.. ఇప్పుడు మ‌న‌కు ఇంత ఓవ‌ర్ యాక్ష‌న్ అవ‌స‌ర‌మా ?`` అని వైసీపీలో హాట్ టాపిక్ న‌డుస్తోంది. అయితే.. ఇది చిన్నాచిత‌కా.. నేత‌ల మ‌ధ్య కానేకాదు.. చాలా మోస్ట్ సీనియ‌ర్ లే దీనిపై చ‌ర్చించుకుంటున్నారు. అస‌లు విష‌యం ఏంటంటే.. ప్ర‌జ‌ల్లో జ‌గ‌న్ స‌ర్కారుపై ఇప్పుడు అంతో ఇంతో సానుభూతి ఉంది. ప‌థ‌కాలు కావొచ్చు.. సంక్షేమ ఫ‌లాలు కావొచ్చు.. పేద‌ల‌కు ఇళ్లు కావొచ్చు.. ఏదైనా కూడా జ‌గ‌న్‌పై పేద‌లు, కార్మిక వ‌ర్గాల్లో సానుభూతి ఉంది.

పైకి కొంద‌రు జ‌గ‌న్ పాల‌న‌ను పంప‌కాల పాల‌న అని విమ‌ర్శిస్తున్నా.. పేద‌లు, కార్మిక వ‌ర్గాల్లో.. ``ఎన్నో ప్ర‌భుత్వాలు వ‌చ్చాయి.. వాళ్లు వాళ్లు పంచుకోవ‌డ‌మే త‌ప్ప‌.. మ‌న‌కు ఎవ‌రూ రూపాయి ఇవ్వ‌లేదు. ఇప్పుడు ఇస్తున్నాడు.. ఆ మాత్రం తింటే త‌ప్పులేదులే!`` అని వారు ఆలోచిస్తున్నారు. ఇవే వ్యాఖ్య‌లు చేస్తున్నారు. దీంతో డ‌బ్బులు ఇవ్వ‌క‌పోయినా.. ఓట్టు వేసేందుకు ఇలాంటి వారు క్యూ క‌డుతున్నారు. సో.. మొత్తానికి గ‌తానికి భిన్నంగా మెజారిటీ వ‌ర్గం నుంచి జ‌గ‌న్ ప్ర‌భుత్వం సానుకూల ప‌వ‌నాల‌ను సంపాయించుకుంది. అయితే.. ఈ ప‌వ‌నాలను వ‌చ్చే మూడేళ్ల‌పాటు నిలబెట్టుకోవాల్సిన అస‌వ‌రం ఉన్న విష‌యం తెలిసిందే.

కానీ, రాజ‌కీయంగా చూస్తే.. జ‌గ‌న్ స‌ర్కారు ఓవ‌రాక్ష‌న్ చేస్తోంద‌ని ఈ వ‌ర్గ‌మే భావిస్తోంది. ఎందుకంటే.. ఇదే పేద‌లు, ఇదే కార్మిక వ‌ర్గాల‌కు చేరువైన టీడీపీ నేత‌ల‌పై జ‌గ‌న్ స‌ర్కారు కేసులు న‌మోదు చేస్తోంది. వారిని అరెస్టు చేస్తోంది. దీంతో ఆయా వ‌ర్గాల్లో సింప‌తీ పోయే ప్ర‌మాదం ఉంద‌నేది వైసీపీ సీనియ‌ర్ల మాట‌. కొన్నాళ్ల కింద‌ట‌.. అచ్చెన్నాయుడును అరెస్టు చేసినా.. ఇప్పుడు ధూళిపాళ్ల న‌న‌రేంద్ర‌ను అరెస్టు చేసినా.. ఈ వ‌ర్గాలు గ‌ళం వినిపించాయి.

అదే స‌మ‌యంలో కొల్లు ర‌వీంద్ర వంటి వారిని అరెస్టు చేసిన ఈ త‌ర‌హా రియాక్ష‌న్ రాలేదు. సో.. ఇప్పుడు ఇలాంటి ఓవ‌ర్ యాక్ష‌న్ చేయ‌డం స‌రైంది కాద‌నేది వైసీపీ నేత‌ల మాట‌. సానుభూతిని పెంచుకుంటేనే త‌ప్ప వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవ‌డం సాధ్యం కాద‌ని కూడా అంటున్నారు. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.




Tags:    

Similar News