అధికారం ఉంది కదా? అని అందరినీ తొక్కేస్తూ పోతుంటే ఏదో ఒకరోజు గట్టి ఎదురుదెబ్బలు తప్పవు. ఇప్పుడు మోడీ సార్ కు అదే తగలబోతోంది. ఆయన వ్యతిరేకులందరూ ఏకం అవుతున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్రకు సంఘీభావం తెలుపుతున్నారు. మోడీ చేతిలో భంగపడ్డ వారందరూ ఇప్పుడు కాంగ్రెస్ ను ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలన్న కృతనిశ్చయానికి వచ్చేశారు. అదే బీజేపీకి, మోడీకి షాక్ లా మారింది. 2024 ఎన్నికల్లో మెజార్టీ తగ్గితే మాత్రం బీజేపీని గద్దెనెక్కకుండా అంతా ఏకం కావడం గ్యారెంటీగా కనిపిస్తోంది.
సార్వత్రిక ఎన్నికలకు దేశం సన్నద్ధమవుతోంది. వచ్చే ఏడాదిలో మార్పు కోసం ప్రజలు పరితపిస్తున్నారు.. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష రాజకీయ పార్టీల్లో చలనం ప్రారంభమైంది. ఇప్పటికే రెండు సార్లు అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీకి మరోసారి అవకాశం రాకుండా చూడాలని ప్రతిపక్షాలు వ్యూహం పన్నుతున్నాయి. ఇందులో భాగంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కీలక నాయకుడు రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టి ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నారు. అటు కమ్యూనిస్టులు తమ పదునైన కామెంట్లతో విమర్శలు గుప్పిస్తుున్నారు. ఇక కొన్ని సంస్థలు సైతం సోషల్ మీడియా వేదికగా మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మోదీ హ్యాట్రిక్ కొట్టడం అసాధ్యమని.. ఈసారి కేంద్రంలో కాంగ్రెస్ ను గద్దెనెక్కించడం ఖాయమని తెలుస్తోంది.
మొన్నటి వరకు మోదీకి మద్దతు ఇచ్చిన శివసేన, అకాలీదల్ తదితర పార్టీలు ఇప్పుడు ఎన్డీయేకు దూరమయ్యాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసిపోయే అవకాశం ఉంటుంది కావచ్చు. ఎన్డీయే ప్రభుత్వం ప్రాంతీయ పార్టీల ఉనికే తొక్కేస్తుండడంతో మోదీకి దూరంగా వెళ్లాయి.
కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీ ఇప్పుడు ఈ ప్రాంతీయ పార్టీలకు ఏకైక ఆప్షన్ గా కనిపిస్తోంది. కమ్యూనిస్టులు ప్రభుత్వాలు ఏర్పాటు చేయరు. కానీ ప్రభుత్వంలో కీలకంగా మారుతారు. వీరికి రాహుల్ గద్దెనెక్కించాలని బలంగా నిర్ణయించారు.. కమ్యూనిస్టుల నిర్ణయాలు రాహుల్ కు ఆయాచితంగా వరంగా మారుతున్నాయి.
మోదీని పడగొట్టడానికి రాజకీయ పార్టీలే కాకుండా కొన్ని సంస్థలు సైతం సోషల్ మీడియా వేదికగా వ్యతిరేక ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. అప్పుడు ఇదే జరిగితే వచ్చే ఎన్నికల వరకూ బీజేపీ అసలు బండారం బయటపడి ఆ పార్టీ ఓటమి ఖాయం.. మోడీ కార్పొరేట్లకు దోచిపెట్టే తీరును వివరిస్తున్నాయి. సగటు వ్యక్తికి, పేదలకు కుటుంబాలకు మోడీ సర్కార్ అన్యాయాన్ని ఏకరువు పెడుతున్నారు.
మోదీ వచ్చిన ఎనిమిదేళ్లలో నిత్యావసరాలు ధరలు కొండెక్కాయి. వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. కార్పొరేట్లకు అనుకూలంగా నిర్ణయాలున్నాయి. ప్రభుత్వ సంస్థలను అప్పనంగా అమ్ముకొని సొమ్ము చేసుకుంటోంది. కార్పొరేట్లకు మేలు చేసేలా పోర్టులు, ఎయిర్ ఇండియా ను జాతీయం చేస్తోంది. ఇలా మోడీ సర్కార్ చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు, ప్రలు సంస్థలు ఏకం కావాలని నిర్ణయించాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.