నాగార్జున ఉప ఎన్నికపై బీజేపీ ఫోకస్ చేసింది. గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నా కూడా ఎక్కడా వెనక్కి తగ్గకూడదని కొత్త ఎత్తులు వేస్తోంది.
బీజేపీ నాగార్జునసాగర్ పై తన వైరుధ్యాన్ని చాటుకున్నట్లు కనిపిస్తోంది. బలమైన టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులతో పోలిస్తే ఓడిపోతామనే అవకాశాలు ఉన్నప్పటికీ మనస్ఫూర్తిగా.. పూర్తి సామర్థ్యంతో పోరాడటానికి బీజేపీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జాతీయ నాయకులతో సహా తన స్టార్ క్యాంపెయినర్లను నాగార్జునసాగర్ ప్రచారానికి రప్పించాలని పార్టీ తాజాగా నిర్ణయించింది.
మంగళవారం మూడు గంటలకు పైగా సమావేశమైన బీజేపీ కోర్ కమిటీ నాగార్జున సాగర్ ప్రచారంపై రూట్ మ్యాప్ సిద్ధం చేసింది.పెద్ద పెద్ద బహిరంగ సమావేశాలకు బదులుగా చిన్న, బూత్, గ్రామ స్థాయి సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే, పార్టీ ప్రచారం కోసం నాయకులు అంతర్గత ప్రాంతాలలో పర్యటించనున్నారు. ఈ సమయంలో ఐదు పోలింగ్ బూత్‌లకు ఒకటి చొప్పున సమావేశం నిర్వహించాలని.. బీజేపీ శ్రేణులతో సమన్వయం చేసే బాధ్యత రాష్ట్రస్థాయి నాయకులకు అప్పగించాలని నిర్ణయించారు. రాష్ట్ర నాయకులు నాగార్జునసాగర్‌లో ఉండి స్థానిక కార్యకర్తలతో కలిసి పనిచేయాలని సూచించింది. నాగార్జునసాగర్‌లో పనిచేసే స్టార్ క్యాంపెయినర్‌లతో బుధవారం పార్టీ కోర్ స్ట్రాటజీ బృందం చర్చించి నిర్ణయం తీసుకుంది.
బీజేపీ తరుఫున రవినాయక్‌కు పార్టీ టికెట్ ఇవ్వడం పట్ల అసంతృప్తిగా ఉన్న బీజేపీ రెబల్ అభ్యర్థి నివేదారెడ్డిని కలుపుకోవాలని బీజేపీ భావిస్తోంది. నివేదా, ఆమె భర్త శ్రీధర్ రెడ్డి ఇప్పటికే బీజేపీ తరుఫున ప్రచారంలో చేరారు. ఇది పార్టీ అవకాశాలను పెంచుతుందని బీజేపీ బృందం భావిస్తోంది.