ఒక తప్పు వల్ల దశాబ్ధాల పాటు సంక్షోభం నడిస్తే దాన్ని ఎవరూ సరిదిద్దుకోలేరు. దీన్నే చారిత్రక తప్పిదం అంటారు. దేశ రాజకీయాల్లోనూ అలాంటి సందర్భం ఒకటి వచ్చింది. నాడు కొన్ని దశాబ్ధాల పాటు పశ్చిమ బెంగాల్ సీఎంగా చేసిన జ్యోతిబసుకు ప్రధానిగా అవకాశం వచ్చింది. కానీ నాటి కొందరు కమ్యూనిస్టు నేతలు దీన్ని తిరస్కరించారు. అదే కమ్యూనిస్టుల అంతానికి ఆరంభం అయ్యింది. కమ్యూనిస్టులు బలమైన నేత లేక పరిపాలనను కోల్పోయారు. బెంగాల్ లోనే కాదు..దేశమంతా కూడా కమ్యూనిస్టు పాలన అడుగంటడానికి ఇదే కారణమైంది.
అమెరికా కూడా ఒక చారిత్రక తప్పిదాలు చేసింది. ఒక్క గల్ఫ్ వార్ లో తప్పితే అన్నింట్లోనూ అమెరికా ఓడిపోయింది. వియత్నం యుద్ధంలోనూ మట్టికరిచింది. అప్ఘనిస్తాన్ లోనూ 20 ఏళ్లుగా తాలిబన్లతో తలపడి చివరకు విసిగి వేసారి చేతులెత్తేసి పలాయనం చిత్తగించేసింది.ఇదొక అమెరికా చరిత్రలోనే చారిత్రక తప్పిదంగా చెప్పొచ్చు.
ఇప్పుడు మరొక చారిత్రక తప్పదం చేసింది అమెరికా.. ఉక్రెయిన్ విషయంలో అమెరికా అదే పనిచేస్తోంది. తాజాగా 1.85 బిలియన్ డాలర్ల ఆయుధాలు, పెట్రేయిట్ మిసైల్స్.. వచ్చే ఏడాది 45 బిలియన్ డాలర్ల సాయం చేస్తామని ఒప్పుకున్నారు. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కి అమెరికా అధ్యక్షుడికి హామీ ఇచ్చారు. అయితే ఇందులో ఖాండాతర, దీర్ఘ శ్రేణి క్షిపణులు ఇవ్వలేదు. కేవలం తమను తాము తమ భూభాగంలో రక్షించుకునే క్షిపణులను మాత్రమే అమెరికా సరఫరా చేసింది. రష్యాపై దాడి చేసింత పెద్ద శ్రేణి ఆయుధాలు ఇవ్వలేదు. అదే చేస్తే రష్యా అన్ని దేశాలపై దాడి చేస్తుంది కాబట్టి ఇలా చేయలేదు.
850 మిలియన్ డాలర్ల నగదును ఉక్రెయిన్ ఆర్థిక అవసరాల కోసం అమెరికా ఇస్తోంది. ఫిబ్రవరి ఇప్పటికే 21.8 బిలియన్ డాలర్ల సాయాన్ని అమెరికా చేసింది. మరో 45 బిలియన్ డాలర్లు వచ్చే ఏడాది ఇస్తోంది.
ఇక జెలెన్ స్కీ గొంతెమ్మ కోరికలపై జోబైడెన్ ఇప్పటికే అసహనం వ్యక్తం చేశారు. మేము ఇచ్చేది సాయం అని.. దీనికి డిమాండ్ చేయవద్దని జెలెన్ స్కీకి హితవు పలికింది. అయితే దీనికి జెలెన్ స్కీ కూడా ఘాటుగా సమాధానం ఇచ్చాడు. ఉక్రెయిన్ కు మీరు ఇచ్చేది సాయం కాదని.. రష్యాను దెబ్బతీయడానికి పెడుతున్న పెట్టుబడి అని గట్టి కౌంటర్ ఇచ్చాడు.
దీంతో రష్యా కోసమే ఇన్ని వేల కోట్లను ఉక్రెయిన్ కు అమెరికా ఇస్తోందన్న విషయం బయటపడింది. ఇది ఆ దేశం చేస్తున్న చారిత్రక తప్పిదం అని.. ప్రపంచ ఆధిపత్యం కోసం ఇలా కోట్లను వితరణ చేస్తూ నిండా మునుగుతోందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.