అనుకున్నట్టే టీ20 వరల్డ్ కప్ కు టీమిండియా బౌలింగ్ విభాగంలో సంచలన మార్పులు చేశారు. బౌలింగ్ వైఫల్యంతోనే ఆసియా కప్ లో ఓడిన దృష్ట్యా ఇప్పుడు ఆ విభాగాన్ని పటిష్టం చేశారని అర్థమవుతోంది. ఇక బ్యాటింగ్ ఏం మారలేదు. ఆసియా కప్ లో ఆడిన వారికే కొనసాగించారు. వికెట్ కీపర్లుగా పంత్, దినేశ్ కార్తీక్ ఇద్దరికీ అవకాశం కల్పించారు. కానీ తుది జట్టులో ఒక్కరికే ఛాన్స్ దక్కనుంది.
అక్టోబర్ లో ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 ప్రపంచకప్ లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. యువ సంచలనం, ఆల్ రౌండర్ దీపక్ హుడాకు ఇందులో అవకాశం కల్పించడం విశేషం. గాయం కారణంగా కొద్దిరోజులు ఆటకు దూరమైన పేసర్ బుమ్రా, హర్షల్ పటేల్ లు టీంలోకి వచ్చారు. దీంతో బౌలింగ్ విభాగం పటిష్టమైంది. ఇప్పటికే భువనేశ్వర్, అర్షదీప్ తో బౌలింగ్ దుర్భేద్యంగా మారనుంది.
మోకాలి గాయం కారణంగా శస్త్రచికిత్స చేయించుకున్న ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఈ టోర్నీకి దూరమయ్యాడు. అతడి స్థానంలో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ను ఎంపిక చేశారు.
ఇక బౌలింగ్ లో మాత్రం భారీ మార్పులు చేశారు. ఆసియాకప్ లో ఆడిన ఆవేశ్ ఖాన్ సహా దీపక్ చాహర్ ను పక్కనపెట్టారు. బుమ్రా, హర్షల్ పటేల్ లు టీ20లో ఏస్ బౌలర్లు. కీలకమైన వికెట్లు, పరుగులు కట్టడి చేయగలరు. వీరిద్దరితో భువనేశ్వర్, అర్షదీప్ కలిస్తే ప్రత్యర్థులకు కష్టమే. ఇక స్పిన్ విభాగంలో సీనియర్ స్పిన్నర్ అశ్విన్ తోపాటు చాహల్ కు చోటు కల్పించారు. వీరికి తోడు అక్షర్ పటేల్ ఉంటారు. ఇక ఆల్ రౌండర్ కోటాలో హార్ధిక్ పాండ్యా ఉండనున్నారు.
వీరే కాదు.. గాయపడితే స్టాండ్ బైగా మహ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్ ను ఎంపిక చేశారు.
బ్యాటింగ్ విభాగం పటిష్టంగా కనపడుతుండగా.. బౌలింగ్ ను బలంగా తయారు చేసినట్టు తెలుస్తోంది.
టీమిండియా ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (కీపర్), దినేష్ కార్తీక్( కీపర్), హార్దిక్ పాండ్యా, అశ్విన్, చాహల్, అక్షర్ పటేల్, బుమ్రా, భువనేశ్వర్, హర్షల్ పటేల్, అర్ష్ దీప్ సింగ్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.