ఏపీ రాజధాని పై కీలక బిల్లు.. ఇదే

Update: 2022-09-21 16:33 GMT
ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలెప్‌మెంట్ అధారిటీ , మెట్రోపాలిటిన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలెప్‌మెంట్ అధారిటీ సవరణ బిల్లును-2022 సభలో మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రవేశపెట్టారు. ఇప్పటికే ఎన్టీఆర్ వర్సిటీ బిల్లు కారణంగా సభలో పెద్ద ఎత్తున రగడ జరిగిన విషయం తెలిసిందే. ఇది చాలదన్నట్టు మరో బిల్లును ప్రవేశ పెట్టి.. అందుకే మరో కుట్రకు జగన్ సర్కార్ తెరదీసిందనే ఆరోపణలు వినవస్తున్నాయి.

ఈ బిల్లు ద్వారా రాజాధానిలో మరో కుట్రకు జగన్ సర్కార్ తెరతీసిందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. రాజధాని గ్రామాల ప్రజల అభిప్రాయాలతో పనిలేకుండా స్పెషల్ ఆఫీసర్లు కు ఏకపక్ష అధికారాలు కట్ట పెడుతూ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ఆమోదం పొందడంతో రాజధాని మాస్టర్ ప్లాన్‌లో స్పెషల్ ఆఫీసర్‌ల ఆమోదంతో మార్పులు చేసేందుకు గానూ ప్రభుత్వానికి అధికారం ఉంది.

బిల్లును ఎలాంటి చర్చ లేకుండా కేవలం శాలియంట్ ఫీచర్స్ చెప్పి బిల్లుకు ఆమోదం తెలిపింది. దీన్ని సవరిస్తూ ఎవ్వరయినా అప్లికేషన్ ఇస్తే చాలు... అక్కడ లోకల్ బాడీలు ఎన్నిక కాకపోతే స్పెషల్ ఆఫీసర్ నిర్ణయం తీసుకునేలా సవరిస్తూ బిల్లు తీసుకువస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.

సెక్షన్ 41(3) లో మాస్టర్ ప్లాన్‌లో మార్పునకు పబ్లిక్  నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని ఉంది. పబ్లిక్‌కే కాదు అక్కడ ఉన్న లోకల్ బాడీలకు అధికారం ఉందని బిల్లు తీసుకు వచ్చామని మంత్రి తెలిపారు. వీకర్ సెక్షన్‌ లకు కేంద్ర పథకాలలో భాగంగా అక్కడ కూడా ఇళ్లు కట్టేలా చర్యలు తీసుకునేలా మార్పులు చేస్తున్నామంటూ బిల్లులో ఉన్న అంశాలను మున్సిపల్ మంత్రి ఆదిమూలపు సురేష్ వివరించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News