హుజురాబాద్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 61మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజైన నిన్న 46మంది నామినేషన్ పత్రాలను సమర్పించారు. వీరంతా బరిలో ఉంటే ఈవీఎంలు పెరగనున్నాయి. ఇక 11న నామినేషన్ల పరిశీలన,13న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. హుజూరాబాద్ లో రాజేందర్ పేరుతో నలుగురు నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ తరపున బరిలో ఈటల రాజేందర్ బరిలో ఉండగా, చివరి రోజున రాజేందర్ పేరుతో మరో ముగ్గురు నామినేషన్లు వేశారు. వీరందరి ఇంటి పేరు కూడా ఈ అనే అక్షరంతోనే ప్రారంభమైంది.
ఇమ్మడి రాజేందర్, ఈసంపల్లి రాజేందర్, ఇప్పలపల్లి రాజేందర్ తమ నామినేషన్లు వేశారు. అయితే ఓటర్లను కన్ ఫ్యూజ్ చేసి గందరగోళానికి గురిచేసేందుకే టీఆర్ ఎస్ ఇలాంటి నామినేషన్స్ వేయించిందని ఆరోపిస్తోంది బీజేపీ. ఇక గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు 13 మంది హుజూరాబాద్ బైపోల్ ఫైట్ లో ఉండగా, 43మంది ఇండిపెండెంట్లతో పాటు మొత్తం 61 మంది 92 సెట్ల నామినేషన్స్ వేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపధ్యంలో ఈ నెల 30వ తేదీన ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ నియోజక వర్గం పరిధిలో నివసించే వారికి ఇది వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. నెగోషియబుల్ ఇన్ స్టుమెంటల్ యాక్ట్1881 ప్రకారం పబ్లిక్ హాలిడే గా ప్రభుత్వం ప్రకటించింది.
హుజురాబాద్ ఉప ఎన్నిక వేడి పెరిగింది. నామినేషన్ల పర్వం ముగియడంతో క్యాంపెయిన్లు మొదలయ్యాయి. ఇప్పటికే టీఆర్ ఎస్, బీజేపీలు హుజురాబాద్ లో ప్రచారం మొదలుపెట్టగా, కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారం చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ 20 మందితో కూడిన క్యాంపెనర్ల జాబితాను రిలీజ్ చేసింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ మాణిక్యం ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహా, మధుయాష్కీ తదితరులు ఈ క్యాంపైనర్ల జాబితాలో ఉన్నారు. గత ఎన్నికల్లో హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీ బలమైన మెరుగైన ఓటు బ్యాంకును సాధించింది. అయితే, ఈసారి అంతకు మించి ఓటు బ్యాంకు సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయబోతున్నది. అధికార టీఆర్ ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసేందుకు పార్టీ శ్రేణులు సిద్ధం అవుతున్నారు.