డ్రాగన్ దరిద్రపు బుద్ధికి పర్ ఫెక్ట్ ఎగ్జాంఫుల్ ఇదే

Update: 2020-06-22 05:00 GMT
ఎంత మంచోడైనా ఎవరో ఒక శత్రువు ఉంటాడు. అది అతడి సమస్య కానే కాదు. కానీ.. కొందరికి మాత్రం అందరితోనూ సమస్యలే. అలాంటప్పుడు సదరు వ్యక్తి పరిస్థితి ఏమిటో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సరిగ్గా ఈ పోలికకు తగ్గట్లే ఉంటుంది చైనా తీరు చూస్తే. కమ్యునిస్టు పాలకుల చేతిలో ఉన్న చైనాకు.. తన సరిహద్దు దేశాలన్నింటితోనూ ఏదో ఒక పంచాయితీ కనిపిస్తూనే ఉంటుంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా.. ఇటీవల కాలంలో డెవలప్ మెంట్ లో దూసుకెళ్లిన ఆ ధేశం.. ఇప్పుడు ఆగ్రరాజ్యంగా మారాలన్న ఆలోచనతో పాటు.. తన చుట్టూ ఉన్న వారి సరిహద్దుల్ని ఆక్రమించుకోవాలన్న దుర్మార్గపు బుద్ధని ప్రదర్శిస్తుంటుంది.

చైనాను డ్రాగన్ దేశంగా అభివర్ణించే తీరుకు తగ్గట్లే.. ఆ దేశ పాలకుల తీరు ఉండటం గమనార్హం. పూటకో మాటగా.. తన తొండి వాదనను అదే పనిగా వినిపించే చైనా తీరు ప్రపంచానికే చిరాకుగా మారింది. ఈ రోజున యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేయటమే కాదు.. పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితం కావటంతో పాటు.. లక్షలాది మంది మరణాలకు కారణమైన వైరస్ పై ఉన్న వాదనలు అన్ని ఇన్ని కావు.

ఇలాంటి విమర్శలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న డ్రాగన్ దేశ ప్రభుత్వానికి ఆ దేశ ప్రజల్లోనూ అంతర్లీనంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వాదన వినిపిస్తోంది. ఇక.. ప్రపంచ దేశాల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. చైనా తీరు పుణ్యమా తమ జీవితాలు దరిద్రంగా తయారయ్యాన్న ఆగ్రహం పలువురిలో వ్యక్తమవుతోంది. ఇలాంటి వేళ.. భారత్ తో సరిహద్దు వివాదాన్ని తెర మీదకు తెచ్చే దారుణానికి తెగబడింది. సరిహద్దుత్లో తన తొండి ఆటతో భారత్ కు చెందిన 20 మంది సైనికుల ప్రాణాల్ని పోయేలా చేసింది.

సరిహద్దులకు సంబంధించి రోజుకో మాటను చెబుతూ.. అందుకు తగ్గట్లు ఎప్పటికప్పుడు తన వాదనకు తగినట్లుగా మ్యాపుల్ని మార్చే తీరు ఆ దేశానికి అలవాటే. ఎల్ వోసీపై తన వైఖరి ఏమిటన్నది అధికారిక రాజకీయ మ్యాపులో చూపించని చైనా.. తన వాదనను స్పష్టంగా చెప్పక పోవటం కనిపిస్తుంది. ఇంతకీ గల్వాన్ వద్ద భారత సైనికులపై దాడికి తెగబడటం వెనుక అసలు కారణం చూస్తే.. లేహ్ - దౌలత్ భేగ్ ఓల్డీ రోడ్డు.. దీని నుంచి శ్యోక్ గాల్వన్ నదుల సంగమ ప్రాంతానికి భారత్ నిర్మించిన వంతెన చైనాకు కంటగింపుగా మారింది. ఈ వంతెన భారత్ కు కీలకమైనవి. వ్యూహాత్మకంగా చూస్తే.. అటు చైనాను.. ఇటు పాక్ ను నిలువరించేందుకు ఇదెంతో అవసరం. అందుకే చైనాకు ఇప్పుడీ వంతెన అక్కసుగా మారింది. ఎల్ వోసీల పేరుతో నిత్యం పేచీలు పెట్టటానికి అసలు కారణమిదే.

ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా దేశం.. ఒక దేశంతో తనకున్న సరిహద్దుల గురించి ఒక వివరణ ఇస్తుంది. దాని మీదనే తన వాదనను వినిపిస్తూ ఉంటుంది. అందుకు భిన్నంగా ఎప్పటికప్పుడు.. తన అవసరాలకు అనుగుణంగా సరిహద్దుల గురించి మాట్లాడే విచిత్రమైన అలవాటు చైనా సొంతం. 1993లో కుదిరిన సరిహద్దు శాంతి - సామరస్య ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు ఏల్ ఏసీగా భావిస్తున్న ప్రాంతాన్నే గౌరవించాలని నిర్ణయించారు. 1996లోని చర్చల ఒప్పందం ప్రకారం తన రాజకీయ మ్యాప్ ఇచ్చేందుకు చైనా నో చెప్పింది. ఇలా ఒప్పందాల్ని ఎప్పటికప్పుడు ఉల్లంఘించటం డ్రాగన్  దరిద్రపుగొట్టు బుద్దికి నిదర్శనంగా పలువురు అభివర్ణిస్తుంటారు.
Tags:    

Similar News