ప్రపంచ క్రికెట్ లో సంచలనంగా.. అంతకు మించిన వివాదాస్పదంగా వ్యవహరించిన బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకిబ్ ఆల్ హసన్ కు శిక్ష వేశారు. దేశవాళీ మ్యాచ్ లో విపరీతమైన తీరును ప్రదర్శించిన అతని తీరు హాట్ టాపిక్ గా మారింది. వికెట్లను బలంగా తన్నిన వీడియో వైరల్ గా మారింది. పెద్ద చర్చకు తెర తీసింది. క్రికెట్ మ్యాచ్ లో ఇంత ఆరాచకాన్ని క్రియేట్ చేసిన అతనికి భారీ శిక్ష పడుతుందని అంచనా వేసినా.. అందుకు భిన్నంగా సింఫుల్ శిక్షతోనే సరిపెట్టారు.
దేశవాళీ మ్యాచ్ లో అంపైర్ నిర్ణయం చెత్తగా ఉందని ఆరోపిస్తూ.. వికెట్ ను బలంగా తన్నటంతో.. అదే మ్యాచ్ లో.. వర్షం కారణంగా మ్యాచ్ ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవటాన్ని నిరసిస్తూ.. స్టంప్ లను తీసి విసిరి కొట్టటం లాంటి చేష్టలు చేశారు. ఈ విపరీత ప్రవర్తనపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మ్యాచ్ అనంతరం.. తాను చేసిన పనులకు షకిబ్ స్పందించారు. సోషల్ మీడియాలో తన తీరుపై పశ్చాతాపాన్ని వ్యక్తం చేస్తూ.. తనను క్షమించాలని కోరాడు.
అదే సమయంలో రషిబ్ వాదనను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్న వారు లేకపోలేదు. స్పందించిన తీరు సరిగా లేదు కానీ.. అంపైర్ నిర్ణయం కూడా రెచ్చగొట్టేలా ఉందన్న వాదన ఉంది. ఐదో ఓవర్ చివరి బంతికి ముందు వర్షం రావటంతో ఆటను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై షకిబ్ సీరియస్ అయ్యాడు. అతడి వాదన ఏమంటే.. మరో బంతి వేయినిచ్చి ఉంటే.. మ్యాచ్ లో ఆరు ఓవర్లు పూర్తి అయి ఉండేవని.. డక్ వర్త్ లూయిస్ పద్దతిలో ఫలితం వచ్చేదని చెబుతున్నారు.
దీంతో.. అంపైర్ నిర్ణయాన్ని తప్పుపడుతూ.. స్టంప్ లను బయటకు లాగి నేల మీద బలంగా విసిరికొట్టాడు. ఇతడి విపరీత చేష్టలకు భారీ శిక్ష పడుతుందని భావించినా.. అందుకు భిన్నంగా మూడు మ్యాచ్ ల నిషేధం.. ఐదు లక్షల బంగ్లాదేశ్ టాకాలు (5800 డాలర్లు) జరిమానాను విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గ్రౌండ్ లో షకిబ్ చేసిన ఆరాచకంతో పోలిస్తే.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అతడికి విధించిన శిక్ష తక్కువే అన్న మాట వినిపిస్తోంది.