కరోనా కల్లోలంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థలను గాడినపడేయానికి ప్రభుత్వాలకు ఉన్న ఏకైక ఆదాయ వనరు పెట్రోల్, డీజిల్ లే. అందుకే మోడీ ప్రభుత్వం రూ.75 ఉన్న లీటర్ పెట్రోల్ ను రూ.120కి చేర్చి ప్రజల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తోంది. సామాన్యుడిని కొడుతూ తన గల్లా పెట్టె నింపుకుంటోంది. ముడిచమురు ధరలు ఆర్థిక మాంద్యం దెబ్బకు భారీగా పెరిగినకొద్దీ ఇక్కడ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూనే ఉంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో 142 డాలర్లకు చేరిన బ్యారెల్ ముడిచమురు ధర మంగళవారం నాటికి 100 డాలర్లకు దిగి వచ్చింది. అయితే మాంద్యం భయాలు నిజమైతే మాత్రం బ్యారెల్ ముడిచమురు ధర ఈ ఏడాది చివరి నాటికి 65 డాలర్లకు .. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి 45 డాలర్లకు దిగొచ్చే అవకాశం ఉందని అంతర్జాతీయ బ్రోకేరేజీ సంస్థలు చెబుతున్నాయి.
అయితే ప్రధాన చమురు ఉత్పత్తి దేశాలైన ‘ఓపెక్’, రష్యా వంటి దేశాలు చమురు ఉత్పత్తికి కోత పెట్టకపోతేనే ఇది సాధ్యమవుతుంది. కానీ అవి కోత పెడితే మాత్రం ధరలు తగ్గే అవకాశాలు లేవు.
మాంద్యం భయాలతో చమురుకు డిమాండ్ తగ్గింది. సరఫరా ఆటంకాలు ఇందుకు తోడయ్యాయి. అమెరికా, యూరప్ దేశాల ఆంక్షలతో రష్యా చమురు, గ్యాస్ ఎగుమతులకు ఆటంకం కలిగింది. ఈయూ దేశాలు కాదనడంతో రష్యా ప్రస్తుతం తన చమురులో ఎక్కువ భాగాన్ని డిస్కౌంట్ ధరలతో భారత్, చైనాలకు ఎగుమతి చేస్తోంది.
సిటీ అంచనాల ప్రకారం..బ్యారల్ చమురు ధర 45-65 డాలర్లకు దిగొస్తే.. భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఉపశమనం కలుగుతుంది. మన చమురు అవసరాల్లో 85 శాతానికి దిగుమతులే దిక్కు. చమురు సెగ పెరిగినప్పుడల్లా భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఆటుపోట్లకు లోనవుతోంది.
బ్యారల్ చమురు ధర 45-65 డాలర్లకు దిగివస్తే మాంద్యం ప్రభావం నుంచి భారత ఆర్థిక వ్యవస్థ తేలికగా బయటపడే అవకాశం ఉంది. రూపాయి పతనానికి మాంద్యం ప్రభావం నుంచి భారత ఆర్థిక వ్యవస్థ తేలికగా బయటపడే అవకాశం ఉంది. రూపాయి పతనానికి పుల్ స్టాప్ పడడంతో పాటు ఎఫ్.పీఐల కొనుగోళ్లు పుంజుకుంటాయని భావిస్తున్నారు.