ఆమెను బాబు పక్కకు పెట్టడానికి కారణం ఇదా?

Update: 2021-07-15 02:39 GMT
మ‌హిళా నాయ‌కురాలు, మాజీ మంత్రి, అతి త‌క్కువ స‌మ‌యంలోనే ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ మాజీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ‌ను టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌క్క‌న పెట్టార‌నే వాద‌న వినిపిస్తోంది. గ‌డిచిన నాలుగురోజులుగా ఏపీలో ప‌ర్య‌టిస్తున్న చంద్ర‌బాబు చిత్తూ రులో ఇటీవ‌ల మ‌ర‌ణించిన పార్టీ కీల‌క నేత‌, శాప్ మాజీ చైర్మ‌న్ పీఆర్ మోహ‌న్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శిం చారు. ఆత‌ర్వాత‌.. గుంటూరు జిల్లాలో పార్టీ నేత‌, ఐదు సార్లు ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర‌ను కూడా ప‌రామ‌ర్శించి.. పార్టీ అండ‌గా ఉంటుంద‌ని ధైర్యం చెప్పారు.

అయితే.. అటు నుంచి అటే ఆయ‌న కృష్ణా జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిపోయారు తప్ప‌.. ప్ర‌స్తుతం క‌ర్నూలు జిల్లాలోనే ఉన్న భూమా అఖిల ప్రియ‌ను మాత్రం ప‌రామ‌ర్శించ‌లేదు. ఆమె కూడా కేసుల్లో ఇబ్బందులు ప‌డుతోన్న‌ బాధితురాలు కావ‌డం గ‌మ‌నార్హం. హ‌ఫీజ్ పేట భూముల విష‌యంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొని ఆమె భ‌ర్త స‌హా ఆమె పై పోలీసులు కేసులు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే.కొన్నిరోజులు అఖిల ప్రియ జైల్లో కూడా ఉండి వ‌చ్చారు. ప్ర‌భుత్వం (తెలంగాణ‌)పై త‌న‌పై క‌క్ష సాధిస్తోందని, తెలంగాణ స‌ర్కారు త‌మ‌ను వేధించ‌డం వెనుక ఏపీ స‌ర్కారు కూడా ఉంద‌ని ఆమె ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే. ఇటు జిల్లాలోనే కాకుండా... నంద్యాల‌, ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ అఖిల‌ను, ఆమె భ‌ర్త భార్గ‌వ్‌రామ్‌ను వైసీపీ ప్ర‌భుత్వం గ‌ట్టిగానే టార్గెట్ చేస్తూ ఎక్క‌డిక‌క్క‌డ న‌ట్టులు బిగిస్తోంది.

అఖిల ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఆమెను ప‌రామ‌ర్శించేందుకు, ధైర్యం చెప్పేందుకు చంద్ర‌బాబు ఎక్క‌డా చొర‌వ చూపించ‌క‌పోవడం గ‌మ‌నార్హం. దీంతో అఖిల ప్రియ‌ను చంద్ర‌బాబు ప‌క్క‌న పెట్టారా?  లేక‌.. తెలంగాణ స‌ర్కారు న‌మోదు చేసిన కేసు విష‌యంలో జోక్యం చేసుకునేందుకు బాబు ఇష్ట‌ప‌డ‌లేదా ?  అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తు న్నాయి. వ్య‌క్తిగ‌తంగా చూసుకుంటే.. భూమా అఖిల ప్రియ దూకుడు చంద్ర‌బాబు గ‌త కొన్నాళ్లుగా ఇష్ట‌ప‌డ డం లేదు. ఏవీ సుబ్బారెడ్డితో స‌ఖ్య‌త చేసుకోవాల‌ని.. స‌ర్దుబాటు ధోర‌ణితో ముందుకు సాగాల‌ని.. కూడా బాబు ప‌లుమార్లు సూచించారు.

అయిన‌ప్ప‌టికీ అఖిల ప్రియ దూకుడు త‌గ్గించ‌లేదు. పైగా నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాల‌ను పీక్ స్టేజ్‌కు తీసుకువెళ్లాల‌నే ల‌క్ష్యంతో తీవ్ర దూకుడు చూపించారు. పార్టీ నేత‌ల‌ను క‌లుపుకొని పోవ‌డంలోనూ ఆమె విఫ‌ల‌మ‌వుతున్నారు. అంతేకాదు, ప్ర‌తి ఒక్క‌రితోనూ వివాదాల‌తోనే ముందుకు సాగుతున్నారు. దీంతో చంద్ర‌బాబు ఆమెను ఉద్దేశ పూర్వ‌కంగా ప‌క్క‌న పెట్టార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇదే కొన‌సాగితే..వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి క‌ష్ట‌మైన ప‌రిస్థితి ఎదుర్కొన‌క త‌ప్ప‌దని అంటున్నారు. మ‌రి అఖిల ఇప్ప‌టికైనా.. దిగి వ‌స్తారో.. విన‌యం నేర్చుకుంటారో లేదో చూడాలి.
Tags:    

Similar News