శృంగారానికి అసలు సిసలు సమయం ఇదేనట?

Update: 2023-01-06 08:40 GMT
శృంగార కౌగిలిలో బంధీ అయిపోవాలని ఎవరు కోరుకోరు..? పెళ్లయిన వారికి ఇలాంటి అవకాశాలున్నా.. పెళ్లి కాని వారు ఆ ఛాన్స్ వస్తే  అదృష్టంగా భావిస్తారు.  అయితే శృంగార క్రీడను సంతోషంగా ఎంజాయ్ చేసేవారు చాలా తక్కువే. అందుకు సరైన అవగాహన లేకపోవడమే. ఒకప్పుడు సెక్స్ గురించి మాట్లాడుకునేందుకు భయపడేవారు. కానీ ఇప్పుడు వివిధ మాధ్యమాల ద్వారా శృంగారంపై అవగాహన కలిగిస్తున్నా.. చాలా మందికి అసలైన శృంగారం గురించి తెలియడం లేదు. ఇందులో భాగంగా అసలు శృంగారం ఎప్పుడు చేయాలి..? ఏ సమయంలో  చేస్తే సక్సెస్ అవుతారు..? అనే విషయాలు మీకోసం..

సాధారణంగా ఉదయం వివిధ పనులతో బిజీగా ఉండేవారు రాత్రి ఇంటికి చేరగా శృంగారంలో పాల్గొంటారు. శృంగారం చేద్దామనుకువాళ్లిద్దరూ అందుకు రెడీగా ఉండాలి. చీకటి పడగానే మొగవారు శృంగారం చేయడానికి సిద్ధమవుతారు. కానీ కొన్ని పనుల వల్ల అలసిపోయిన ఆడవారు మాత్రం అందుకు సహకరించరు. వారు సహకరించకపోతే సరైన శృంగారం చేయలేదు. అది తృప్తి నివ్వదు. అయితే భాగస్వామి శృంగారానికి రెడీగా లేకపోయినా వారిని ముగ్గులోకి దించే కొన్ని ఉపాయాలు ఉన్నాయి. వాటిని పాటించాలి.

ఏ స్త్రీ వెంటనే శృంగారం చేయమని కోరదు. వారిని శృంగార క్రీడలోకి దించే బాధ్యత మొగవాళ్లదే ఉంటుంది. అందుకు ముందుగా ఫోర్ ప్లే చేయడం అలవాటు చేసుకోవాలి. వారు ఆకర్షణకు గురయ్యే ప్రదేశాల్లో టచ్ చేయడం వల్ల ఇంప్రెస్ అవుతారు. ముందగా వెనుక నుంచి కౌగిలించుకోవడం. ఆ తరువాత నడుము, మెడ భాగంలో ముద్దుల వర్షం కురిపించాలి. ఆ తరువాత ముహం పైకి రావడంతో దాదాపు  వారు శృంగారాన్ని కోరుకునేందుకు రెడీ కావచ్చు. ఆ సమయంలో వారిని పడకగదిలోకి తీసుకెళ్తే స్వర్గం కనిపిస్తుంది.

అయితే చాలా మంది రాత్రిళ్లు పొద్దు పోయాక శృంగారాని చేయడానికి అలవాటు పడుతారు. కానీ అలసిన మనసుతో సెక్స్ లో పాల్గొంటే అనుకున్న విధంగా చేయలేరు. అందువల్ల బాగా నిద్రపోయి లేచిన తరువాత యాక్టివ్ సమయంలో శృంగారం చేస్తే అదిరిపోతుందని అంటున్నారు. ఇక ఆడవాళ్లు ఉదయం సెక్స్ చేసేవాళ్లను ఎక్కువగా కోరుకుంటారని పలు పరిశోధనల్లో వెల్లడైంది. నిద్రపోయిన తరువాత శరీరం ఉల్లాసంగా మారతుంది. ఈ సమయంలో భాగస్వామిని అనుకున్న విధంగా తృప్తి పరచవచ్చు. ఇదే సమయంలో మీరు అధిక ఆనందాన్న పొందవచ్చు.

మరో సర్వేలో అర్ధరాత్రి 12 గంటల తరువాత శృంగారంలో పాల్గొనడం అనువైన సమయం అని అంటున్నారు. ఈ సమయంలో శరీరం కూల్ గా మారుతుంది. అప్పటి వరకు ఉన్న టెన్షన్లు తగ్గి రిలాక్స్ గా మారుతారు. మరోవైపు ఈ సమయంలో ఎలాంటి అవాంతరాలు ఎదురుకావు.

అందువల్ల ఈ టైంలో కలిసేందుకు ప్లాన్ వేసుకోవాలని అంటున్నారు. ఇదిలా ఉండగా శృంగారంలో కనీసం అర గంట పాటు ఎంజాయ్ చేయాలంటున్నారు. కొందరు మొగవారు వీర్యం పడగానే వెంటనే లేచి పక్కకు వెళ్తారు. అయితే తొందరగా పని కానీయకుండా కాస్త రిలాక్స్ గా టైం తీసుకుంటే భాగస్వామికి సంతోషాన్ని ఇచ్చిన వారవుతారు. అలాగే ఆడవాల్లు ఎక్కువ సేపు సెక్స్ ను కోరుకుంటారని కూడా కొన్ని అధ్యయనాల్లో తేలింది. 



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News