ఇదేమీ సినిమా సీన్ కాదు. నిజంగానే నిజం. సినిమాల్లోని విలన్ తన రక్షణ కోసం ఏర్పాటు చేసుకునే అనేక వ్యవస్థల్ని సినిమాల్లో చూస్తుంటాం. అందుకు ఏ మాత్రం తీసిపోని రీతిలో.. ఆ మాటకు వస్తే నాలుగు ఆకులు ఎక్కువ చదివిన చందంగా గోవాడ్రగ్స్ డాన్ తన ఇంట్లో ఏర్పాటు చేసుకున్న రక్షణ వ్యవస్థ గురించి తెలిస్తే నోట మాట రాదంతే. తాజాగా తెలంగాణ పోలీసులు అతగాడ్ని టార్గెట్ చేసి.. అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ప్రతికూలతలు ఎదురైనా.. పట్టువిడవని విక్రమార్కుడిలా ప్రయత్నించి.. విజయం సాధించారు.
గోవా డ్రగ్స్ మాఫియాలో కీలకమైన వ్యక్తిగా పేర్కొనే నరేంద్ర ఆర్యను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. ఇతగాడి అరెస్టు కోసం అతడి ఇంటికి వెళ్లిన తెలంగాణ పోలీసులకు షాకింగ్ అనుభవం ఎదురైనట్లుగా చెబుతున్నారు. గోవాలోని ఒక సంపన్న కాలనీలో నివాసి అయిన అతను.. పోలీసులు దాడి చేసేందుకు వీలు లేకుండా 150మేలుజాతి కుక్కలతో కాపలా కాయిస్తున్న వైనం షాకింగ్ గా మారింది.
అలాంటి అడ్డాపై తెలంగాణ పోలీసులు దాడి చేసి.. అతగాడి చేతులకు బేడీలు వేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో గోవా పోలీసులు సహకరించకున్నా.. 150 కుక్కల నీడలో దర్జాగా బతికేస్తున్న నరేంద్ర ఆర్యను అదుపులోకి తీసుకొన్నారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్.. హుమయూన్ నగర్.. చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన మూడు డ్రగ్స్ కేసుల్లో హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ ఫోకస్ చేసింది.
ఈ కేసులో ప్రధాన నిందితుల్ని గుర్తించే పనిలో కింగ్ పిన్స్ జాడను గుర్తించారు. గోవాలో జరిగిన దాడుల్లో ఇద్దరు కింగ్ పిన్ లను అరెస్టు చేయగా.. మూడో కింగ్ పిన్ మిస్ అయ్యాడు. ఇతగాడి జాడ కోసం హైదరాబాద్ పోలీసులు ప్రత్యేకంగా ఫోకస్ చేశారు.
హుమయూన్ నగర్ కేసులో కీలక నిందితుడు నరేంద్ర ఆర్య అన్న విషయాన్ని గుర్తించిన పోలీసులు.. అతడ్ని అరెస్టు చేసేందుకు వెళ్లారు. ఇతగాడు దేశ వ్యాప్తంగా 450 మందికి రూ.30 లక్షలు విలువ చేసే డ్రగ్స్ ను సరఫరా చేసినట్లుగా చెబుతున్నారు. డార్క్ వెబ్.. సోషల్ మీడియా.. ఇతర యాప్ ల ద్వారా వందలాది మంది కస్టమర్లకు అవసరమైన డ్రగ్స్ ను సరఫరా చేస్తుంటాడు. ఇతగాడిని అరెస్టు చేసేందుకు వెళ్లిన హైదరాబాద్ పోలీసులకు గోవా పోలీసులు ఏ మాత్రం సహకారాన్ని అందించలేదు.
ఇదే విషయాన్ని ఒక మీడియా సంస్థ గోవా పోలీసుల చేతకానితనాన్ని.. హైదరాబాద్ పోలీసుల ధైర్య సాహసాలపై ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది. నరేంద్ర ఆర్యను అరెస్టు చేయటానికి వెళ్లిన హైదరాబాద్ పోలీసులకు.. అతగాడు ఇంట్లో తన రక్షణగా ఉంచుకున్న కుక్కలతో సవాలు ఎదురైంది. వాటిని అడ్డుకునే క్రమంలో పోలీసులకు గాయాలయ్యాయి. అయినప్పటికి తగ్గకుండా.. నరేంద్రఆర్యను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. తాజా ఎపిసోడ్ తో హైదరాబాద్ పోలీసుల సత్తా ఏమిటన్నది మరోసారి నిరూపితమైందని చెప్పాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.