అమెరికాలో ఉండాల‌నుకుంటే ఇది ఉండాల్సిందే

Update: 2017-02-25 17:06 GMT
ఇపుడు అంద‌రి దృష్టి అమెరికాపైనే. కొద్దికాలం క్రితం వ‌ర‌కు అయితే అవ‌కాశాల కోణంలో కాగా....ఇపుడు ఆందోళ‌న‌లు, ద్వేషంతో అగ్ర‌రాజ్యం వార్త‌ల్లో నిలుస్తోంది. ఒక‌వైపు ట్రంప్ క‌త్తిగ‌ట్టే ఆదేశాలు మ‌రోవైపు తాజాగా తెలుగు వ్యక్తిపై కాల్పుల ఘ‌ట‌న నేప‌థ్యంలో అంద‌రిలోనూ పెద్ద ఎత్తున్నే ఆందోళ‌న నెల‌కొంది. ఈ క్ర‌మంలో వాషింగ్ట‌న్ డీసీ నుంచి విడుద‌ల‌యిన‌విగా చెప్తున్న కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాలు ఇపుడు చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. అధికారికం కాక‌పోయిన‌ప్ప‌టికీ ఈ స‌ల‌హాలు అంద‌రికీ ఉప‌యుక్తంగా ఉండ‌టంతో వైర‌ల్ గా మారాయి.

ఇవే ఆ స‌ల‌హాలు'

-- అమెరికాలో శాశ్వ‌త నివాసితులు అయితే స‌ద‌రు గుర్తింపు ప‌త్రం అయినా గ్రీన్ కార్డును  పర్సులోనే ఉంచుకోవాలి. దీంతో పాటు ఇంట్లో అధ‌నంగా ఓ గ్రీన్ కార్డు హార్డ్ కాపీ పెట్టుకోవడం మంచిదంటున్నారు. అమెరికన్ చట్టం ప్రకారం బ‌య‌టి దేశాల నుంచి వలస వచ్చినవాళ్లయితే వాలిడిటీతో కూడిన పాస్ పోర్ట్ తో పాటు I-94 (ఆరైవల్ డిపార్చర్ హిస్టరీ) ప్రింట్ అవుట్ కూడా జేబులో ఉంచుకోవాల్సిందే. ఈ ఆధారం లేనిప‌క్షంలో తీవ్ర ఇబ్బందులు త‌ప్ప‌వంటున్నారు.

--ఒక‌వేళ అక్రమ వలసదారుల‌యితే, లేదా ఏదైనా ఆరోప‌ణ‌లో నిందితులుగా ఉంటే ఇక అమెరికాలో నివ‌సించ‌డంపై ఆశ‌లు వ‌దులుకోవాల్సిందే. తాజా నిబంధ‌న‌ల ప్ర‌కారం సొంత దేశాలకు వెళ్ళిపోడానికి సిద్ధంగా ఉండాల్సిందే.

-ఏదైన కేసులో ఒకవేళ అరెస్ట్ అయి, జైల్లో ఉండాల్సివస్తే... పిల్లలని చక్కగా చూసుకునే నమ్మకస్తులను ముందుగానే ఏర్పాటుచేసుకోవాలి.

-లేట్ నైట్స్ లో బయట ఎక్కడా బస చేయకూడ‌దు.  ట్రాఫిక్ లో రెడ్ సిగ్నల్ దాటకూడ‌దు.

-అమెరికాలో మీ వ‌ల‌స మీద ఏ చిన్న అనుమానమున్నా.. స్నేహితుడు, బంధువు, కొలీగ్‌..ఇలా ఎవ‌రో ఒక‌రిని కేర్ టేకర్ గా సిద్ధం చేసుకోండి.

ఇది అధికారిక‌మా అంటే అవును అనే స‌మాధానం రావ‌డం లేదు. కానీ... గ‌తంలో వ‌లే ఇప్పుడు లైట్ తీసుకుంటే మాత్రం ఓ రేంజ్‌లో చుక్క‌లు చూడాల్సిందేన‌ని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News