దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. రోజురోజుకి నమోదు అయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక తెలంగాణలో కూడా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ కరోనా సెగ పండుగలు, ఉత్సవాలపై బాగా పడుతోంది. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న బోనాలు చడీ చప్పుడు లేకుండా జరుగుతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేనంతగా అత్యంత నిరాడంబరంగా బోనాలు జరుగుతున్నాయి. ఈ వైరస్ ప్రభావం వినాయకచవితి ఉత్సవాలపైనా పడుతోంది. రాష్ట్రంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో బాలాపూర్ గణేశ్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది.
వినాయకుడి విగ్రహం ఎత్తు విషయంలో బాలాపూర్ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఏడాది ప్రతిష్ఠించే 21 అడుగుల విగ్రహానికి బదులుగా ఈ ఏడాది ఆరడుగుల విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయించింది. అలాగే, ఈ ఏడాది గణేష్ లడ్డూ వేలం కార్యక్రమం కూడా నిర్వహించకూడదని కమిటీ నిర్ణయం తీసుకుంది. ఎందుకు అంటే బాలాపూర్ గణేశ్ లడ్డుకి విశేషమైన గుర్తింపు ఉంది. లడ్డు వేలం కోసం ఎంతోమంది భక్తులు వస్తారు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్సవ కమిటీ సభ్యులు వెల్లడించారు. అలాగే గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మాత్రమే తొలిపూజ నిర్వహించనున్నట్లు , కరోనా దృష్ట్యా ఈ ఏడాది భక్తుల పూజలు, దర్శనాలను రద్దు చేశారు. గణేశ్ శోభాయాత్రపై అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని ఉత్సవ కమిటీ తెలిపింది. ఇక ఈ మహమ్మారి ప్రభావంతో దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఖైరతాబాద్ వినాయక ఉత్సవ కమిటీ కూడా కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది 65 అడుగుల ద్వాదశాదిత్య మహాగణపతిని ఏర్పాటు చేయగా... ఈసారి కేవలం 27 అడుగులతో ధన్వంతరి వినాయకుణ్ని ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయించింది.