కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకి మనిషిలో ఉన్న మానవత్వం అనేది పూర్తిగా చచ్చిపోయింది. ఇతరుల విషయంలో అంటే సరి , కనీసం కుటుంబ సభ్యులు , బంధువుల్లో ఎవరైనా మరణించినా కూడా కనీసం శవాల దగ్గరకి రావడానికి కూడా భయంతో వణికిపోతున్నారు. కన్న బిడ్డలు సైతం పరాయి వారి శవాలుగా భావించి ఎంతో కొంత డబ్బులు చెల్లించి చేతులు దులుపుకుంటున్నారు.
ఇలాంటి సమయంలోకరోనా బాధిత మృతులకు అన్నీ తామై, దహన సంస్కారాలు నిర్వహిస్తూ , వారిని ఈ భూలోకం నుండి గౌరవంగా సాగనంపే బాధ్యతను ఆ నలుగురూ భుజానికి ఎత్తుకున్నారు. పాడె మొయ్యడం, అంతిమ సంస్కారాలు చేయడం మహిళలకు నిషిద్ధం అని వారి మతాలు, కులాలూ చెబుతున్నా కూడా మనిషిలోని మానవత్వం చనిపోతున్న ఈ సమయంలో కరోనా బాధితులకు కన్నబిడ్డలై మానవత్వాన్ని తమ మెడన మోస్తూ షేక్ మౌనిక, సీత, సంజన, వరలక్ష్మి ఈ సమాజంలో పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఆ నలుగురు కూడా మంచి స్నేహితులు ,అలాగే సామాన్యులే. షేక్ మౌనిక ఒక స్కూల్లో డ్యాన్స్ టీచర్. కల్తీ సీత గృహిణి. కొండా సంజన ఆర్ ఎంపీ వైద్యురాలు. మెట్టెల వరలక్ష్మి దినసరికూలీ. వారిది ఖమ్మం జిల్లా సత్తుపల్లి. కరోనా మృతుల పట్ల సొంత కుటుంబాలు, సమాజం చూపే వివక్షను చూసి వారు తట్టుకోలేక ,అటువంటి అంత్యక్రియలు చేసేందుకు ముందుకు వచ్చారు. రాత్రి, పగలు తేడా లేదు. ధనిక, పేద భేదం లేదు. ఎవరు ఏ వేళలో ఫోన్ చేసి, సాయం కోరినా కదిలి వెళ్తున్నారు. తామే బంధుమిత్రులై పాడె మోస్తున్నారు. కన్నబిడ్డల్లా కొరివి పెడుతున్నారు. ఆడపిల్లలు మీకెందుకు ఇవన్నీ అని ప్రశ్నించే సమాజానికి, ఆడవాళ్లం కనుకే మాకు ఈ పట్టింపు. అమానవీయతను చూడలేకపోతున్నాం. అందుకే అందరూ తమవారే అనుకోని ఈ సహాయం చేస్తున్నాం అన్నారు. ఒక రోజు రాత్రి ఎనిమిది గంటలకు మాకు ఫోన్ వచ్చింది.
కరోనాతో బాధపడుతూ కొద్దిసేపటి కిందట కన్నుమూసిన తన తల్లికి అంత్యక్రియలు జరిపించమని అవతలి వ్యక్తి మమ్మల్ని అభ్యర్థిస్తున్నాడు. ఆ సమయంలో హోరున వర్షం. కాదనలేక, అప్పటికప్పుడు మేమంతా బయలుదేరి, సత్తుపల్లికి ఇరవై కిలోమీటర్ల దూరంలోని ఆ ఊరికి చేరుకున్నాం. ఇంట్లోకెళ్లి చూస్తే, శ్వాస ఆడక ఉక్కిరిబిక్కిరై, ఒంటిమీద దుస్తులు కూడా చింపేసుకున్న ఆ తల్లి మృతదేహాన్ని చూసి మా కడుపు తరుక్కుపోయింది. మాకు కన్నీళ్లు ఆగలేదు. కనీసం ఆమె ఒంటిపై ఒక దుప్పటైనా కప్పచ్చు కదా అని ఆమె కొడుకుని మేము అడిగితే, అమ్మకి కరోనా కదా, అంటూ నీళ్లు నమిలాడు. మాకు నోట మాట రాలేదు. ‘కరోనా భయం కన్నతల్లి మీద ప్రేమను కూడా మింగేసిందా’ అనుకున్నాం. రాత్రి పదికొండు గంటలకు ఆ మాతృమూర్తికి అంత్యక్రియలు చేశాం అని చెప్పారు.