సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కడం వల్ల సౌలభ్యాలు ఎన్ని ఉంటున్నాయో...సమస్యలు అదే స్థాయిలో వచ్చిపడుతున్నాయి. టెక్నాలజీ ఆధారంగా జరిగే మోసాల్లో ఎక్కువగా డబ్బు కేంద్రంగా జరిగేవే కావడం కొత్త విషయం కాదు. అయితే ఇంత కాలం సామాన్యులను చిక్కులు పెట్టిన చోరులు ఇపుడు ఎంపీ సొమ్ముకు ఎసరు పెట్టారు. ఏకంగా కార్డ్ క్లోన్ చేసి సొమ్ములు కాజేశారు.
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పార్లమెంట్ సభ్యుడు, మాజీ మంత్రి తోట నర్సింహులుకు సెల్ఫోన్ కు దాదాపు 15 రోజుల కిందట తన ఖాతా నుంచి రూ.50 వేలు డ్రా చేసినట్లు ఎస్సెమ్మెస్ వచ్చింది. రూ.13 లక్షల వరకు ఉన్న తన ఖాతా నుంచి తనకు తెలియకుండా నగదు డ్రా అవడంతో అప్రమత్తమైన ఆయన బ్యాంక్ కు సమాచారమిచ్చి లావాదేవీలు నిలిపివేయించారు. ఆరా తీస్తే డెబిట్ కార్డును క్లోనింగ్ చేసిన సైబర్ నేరగాళ్లు రూ.50 వేల నగదు డ్రా చేశారని తేలింది. ఎస్సెమ్మెస్ లోని వివరాల ప్రకారం రూ.50 వేలు గోవాలోని ఓ ఏటీఎం సెంటర్ నుంచి డ్రా అయ్యాయి. సైబర్ క్రైమ్ పోలీసులకూ ఫిర్యాదు చేయడంతో వారం రోజుల క్రితం కేసు నమోదైంది. గోవా ఏటీఎం నుంచి నగదు డ్రా కావడానికి కొన్ని రోజుల ముందు బెంగళూరులో షాపింగ్ చేసి తన డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరిపానని ఏపీ సీఐడీ అధికారులకు నర్సింహులు తెలిపారు.
కార్డును ఒకసారి స్వైప్ చేస్తే దానికి సంబంధించిన డేటా మొత్తాన్ని సంగ్రహించే స్కిమ్మర్ సహాయంతో షాపింగ్ సమయంలోనే సైబర్ నేరగాళ్లు ఎంపీ డెబిట్ కార్డును క్లోన్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఏటీఎం నుంచి నగదు డ్రా చేయడానికి కచ్చితంగా కార్డుతో పాటు పిన్ నంబరూ ఉండాలి. నర్సింహులు పిన్ నంబర్ నేరగాళ్లకు ఎలా చేరిందనేది అంతు చిక్కట్లేదు. ఇందులో బెంగళూరు దుకాణానికి చెందిన వారి పాత్ర, లేదా బ్యాంకు ఆన్ లైన్ ఖాతా వివరాలను హ్యాక్ చేసి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. సదరు ఏటీఎం కేంద్రంలో సీసీ కెమెరాలేమైనా ఉంటే వాటి ఫుటేజీ సంపాదించే ప్రయత్నాలు ప్రారంభించారు.