గోదావరి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలను పొందిందో చెప్పనక్కర్లేదు. ఎన్నికల్లో ఓడారు.. అదంతా జరిగిపోయింది. ఇక తదుపరి ఏమిటనేది ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి చాలా కీలకమైన అంశం. తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష వాసాలు కొత్త కాదు అన్నట్టుగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు చెబుతూ ఉంటారు. అయితే టీడీపీకి నేతల వరస రాజీనామాలు మాత్రం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి.
ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిన వారు కూడా ఇప్పుడు ఆ పార్టీని వీడుతూ ఉన్నారు. అలాంటి వారిలో తాజాగా వరుపుల రాజా రాజీనామా చేశారు. పార్టీ అధిష్టానంపై దుమ్మెత్తి పోస్తూ ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా విషయాన్ని ప్రకటించారు.
అయితే గోదావరి జిల్లాల్లో మరిన్ని రాజీనామాలు ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి కొందరు నేతల పేర్లు కూడా ఈ జాబితాలో వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా కొందరి పేర్లు ప్రస్తావనకు వస్తున్నాయి. టీడీపీకి నెక్ట్స్ రాజీనామా చేసేది వాళ్లే అనే మాట వినిపిస్తోంది.
ఆ జాబితాలోని ముఖ్యమైన పేర్లు.. తోట త్రిమూర్తులు - జ్యోతుల నెహ్రూ. వీరు కూడా త్వరలోనే టీడీపీకి రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. వీరిలో తోట త్రిమూర్తులు చాన్నాళ్లుగా తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల్లో యాక్టివ్ కనిపించడం లేదని పరిశీలకులు అంటున్నారు.
జ్యోతుల నెహ్రూ మాత్రం తెలుగుదేశంలో ఉన్నట్టుగా అప్పుడప్పుడు హడావుడి చేస్తున్నారు. అధికార పక్షంపై విమర్శలు చేస్తూ ఉంటారు. అయినా ఆయన కూడా తెలుగుదేశంలో ఉండరనే ప్రచారం జరుగుతోంది. తోట త్రిమూర్తులు రాజీనామాకు సర్వం సిద్ధం చేసుకున్నట్టే అనే టాక్ నడుస్తూ ఉంది. వీరు గాక గోదావరి జిల్లాల్లోని పలువురు నేతలు రాజీనామాలకు రెడీ అంటున్నారని భోగట్టా!