తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టిడిపికి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. టిడిపికి గుడ్ బై చెప్పిన ఆయన పార్టీ అధినేత చంద్రబాబును టార్గెట్ గా చేసుకుని చేసిన వ్యాఖ్యలు... రాసిన లేఖ టీడీపీలో తీవ్ర కలకలం రేపుతోంది. పార్టీని వీడుతున్న సందర్భంగా ఆయన చంద్రబాబుపై ఎన్నో ఆరోపణలు చేశారు. చంద్రబాబు తనపై చేసిన వ్యాఖ్యలు చాలా బాధించాయని చెప్పిన తోట... నేరుగా చంద్రబాబుకే సవాల్ విసిరారు. ఇటీవల చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా కొంతమంది నేతలు పార్టీలోకి వచ్చి సొంత పనులు చేయించుకుని వెళ్లిపోతున్నారని విమర్శించిన సంగతి తెలిసిందే.
పార్టీ వీడుతున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలపై స్పందించిన తాను టిడిపిలో 15 సంవత్సరాల నుంచి ఉన్నానని... చంద్రబాబు ద్వారా ఒక వ్యక్తి గత పని అయినా చేయించుకున్నారని ఆయన నిరూపించగలరా ? అని సవాల్ విసిరారు. పార్టీ ద్వారా వ్యక్తిగత పనులు చేయించుకున్నట్టు చంద్రబాబు నిరూపిస్తే కార్యకర్తల సమక్షంలోనే ఉరి వేసుకుంటానని స్పష్టం చేశారు. ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీకి పలువురు కీలక నేతలు రాజీనామా చేసినా చంద్రబాబును నేరుగా టార్గెట్ చేస్తూ సవాల్ చేసిన వారు ఎవరూరు లేరు.
గోదావరి జిల్లా కాపు నేతల్లో కీలకంగా ఉన్న తోట పార్టీని వీడడంతో పాటు... పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ లేఖ రాయడం కూడా తెలుగుదేశం నాయకులను కలవరపెడుతోంది. ఈ లేఖలో తోట బాబుపై తీవ్ర పదజాలం వాడినట్టు కూడా తెలుస్తోంది. పార్టీని వీడిన సుజనా చౌదరి - సీఎం రమేష్ మీ సూచనలతోనే వెళ్లారు కదా అని ప్రశ్నించడం కూడా సీనియర్ నాయకుల్లో చర్చకు దారి తీస్తోంది.
ఇక ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. తోట లాంటి కీలక నేతలను బుజ్జగించేందుకు చంద్రబాబు జ్యోతుల నెహ్రూ లాంటి వాళ్లతో రాయభారాలు పంపినా ఉపయోగం లేకుండా పోయింది. పార్టీ మారిన తోట బాబుకే సవాల్ చేస్తూ బయటకు వెళ్లడంతో బాబుకు ఈ పరిణామం ఏ మాత్రం మింగుడు పడడం లేదని తెలుస్తోంది.