హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో ఆయన శనివారం తెలంగాణ డిజిపి కె.అనురాగ్‌శర్మకు ఫిర్యాదు చేశారు. తనను చంపేస్తామంటూ కొందరు దేశ - విదేశాల నుంచి బెదిరింపు కాల్స్ చేస్తున్నారని ఆయన పోలీసులకు తెలిపారు. అయితే ఎవరు? ఎన్ని ఫోన్ కాల్స్, ఏ నెంబరు ద్వారా వచ్చాయన్నది పేర్కొనలేదు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ, గతంలో కూడా తనకు ఇదేవిధమైన ఫోన్ కాల్స్ వచ్చాయని, ఎన్ని సార్లు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రాణహాని ఉందని, కనుక ఇప్పటికైనా పోలీసులు తనకు రక్షణ కల్పించాలని రాజాసింగ్ కోరారు.
కాగా గత సంవత్సరం బీజేపీ సంస్థాగత ఎన్నికల సందర్భంగా కూడా ఆయనకు ఇదేవిధంగా బెదిరింపులు వచ్చాయని కొందరు కార్యకర్తలు చెబుతున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, నగర కార్యదర్శిలతో రాజాసింగ్‌కు అంతర్గత విభేదాలున్నట్టు అప్పట్లో ప్రచారం సాగింది. అయితే రాజాసింగ్ కు వచ్చిన బెదిరింపు కాల్స్ పార్టీకి సంబంధించిన వారు చేసినవా? లేక ఇతరులెవరైనా చేశారా? అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/