ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు.. విగత జీవులుగా మారారు. ఆడుకోవడానికి వెళ్లిన పిల్లలు ఇంటికి రాలేదు. ఎంత వెతికినా దొరకలేదు. దాదాపు 24 గంటల తర్వాత చివరకు వారు ఇంటిదగ్గర కారులోనే నిర్జీవంగా కనిపించారు. ఈ విషాధ ఘటన మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో చోటుచేసుకుంది. అసలు ఏం జరిగిందంటే...
మహారాష్ట్ర లోని నాగ్‌పుర్ పచ్‌పోలీ పోలీసు స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. అక్కడ స్థానికంగా నివసిస్తోన్నఓ కుటుంబం పిల్లలు కనిపించకుండా పోయారు. తౌఫిఖ్ ఫిరోజ్ ఖాన్(4), అలియా ఫిరోజ్ ఖాన్(6), అఫ్రిన్ ఇర్షద్ ఖాన్(6) శనివారం సాయంత్రం మూడు గంటల నుంచి కనిపించకుండా పోయారు. సమీపంలోని గ్రౌండ్ లో ఆడుకోవడానికి వెళ్లి ఉంటారని తల్లిదండ్రులు భావించారు.
అయితే, రాత్రి కావొస్తున్న పిల్లల జాడ కనిపించలేదు. దీనితో వారు తీవ్ర ఆందోళనకు గురై.. పోలీసుల్ని ఆశ్రయించారు. దాంతో కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు.. వారి కోసం ఆ ప్రాంతంలో గాలించారు. ఆదివారం సాయంత్రం వరకు కూడా చిన్నారుల ఆనవాలు దొరకలేదు. దీనితో తల్లిదండ్రులు తీవ్ర టెన్షన్ కు గురై అయ్యారు.
ఆదివారం సాయంత్రం 7 గంటల సమయంలో ఒక కానిస్టేబుల్ వారి ఇళ్ల సమీపంలో పార్క్ చేసిన ఓ కారు ను గుర్తించారు. కారులోకి తొంగి చూడగా అందులో ముగ్గురు పిల్లల మృతదేహాలు కనిపించాయి. తౌఫిక్,ఆలియా తోబుట్టువులు కాగా, అఫ్రీన్ సమీపంలో నివసించినట్లు అధికారి తెలిపారు. ఆ కారు ఇంటికి 50 మీటర్ల దూరంలోనే తుక్కు దుకాణం ముందు ఉండటం గమనార్హం.
చిన్నారులు ఆడుకునే క్రమంలో కారులోకి ఎక్కడంతో.. తర్వాత దాని లాక్ పడిపోవడం వల్లే ఈ మరణాలు సంభవించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఊపిరాడక వారు చనిపోయారని ప్రాథమిక నివేదికను బట్టి తెలుస్తోంది. పోస్టుమార్టం తర్వాత అసలు కారణాలు తెలుస్తాయని అధికారులు వెల్లడించారు.
ఎంతో ప్రేమగా పెంచుకున్న పిల్లలు విగత జీవులుగా కనిపించడంతో.. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన అక్కడి వారిని కలిచి వేస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.