అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఒక అగంతకుడు బెర్లింగ్టన్ నగరంలో కేస్కేడ్ షాపింగ్ మాల్‌లోకి చొరబడ్డాడు. నిత్యం రద్దీగా ఉండే ఈ మాల్ లో మూడు అంతస్తుల్లో మల్టీప్లెక్సులు, రెస్టారెంట్లూ ఉన్నాయి. శుక్రవారం రాత్రి ఎంతో రద్దీగా ఉన్న సమయంలో ఒక అగంతకుడు తుపాకీ పట్టుకుని ఈ మాల్ లోకి ప్రవేశించినట్టు పోలీసులు చెప్పారు. విచక్షణారహితంగా కాల్పులకు తెగబడటంతో మాల్ పరిసరాలు భీతావహ వాతావరణం నెలకొంది. ఈ కాల్పులలో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్టు వాషింగ్టన్ స్టేట్ పోలీసులు తెలిపారు. అయితే, ఈ ఘటనకు కారకుడైన అగంతకుడు అక్కడి నుంచి వెంటనే పారిపోయాడనీ, వీలైనంత త్వరగా అతడిని పట్టుకునేందుకు పోలీసులు శ్రమిస్తున్నారనీ - గాలింపు చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయని సార్జంట్ మార్క్ ఫ్రాన్సిస్ వెల్లడించారు.
అయితే, ఈ దాడిలో పాల్గొన్నది ఒక్కరేనా, ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఈ ఘటన చోట చేసుకుంది. ఈ దాడిలో చాలామందికి గాయలయ్యాయి. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన వీడియోల ఆధారంగా ఈ దాడికి పాల్పడింది ఒక కుర్రాడు అని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. తుపాకీ చేతులో పట్టుకున్న ఓ కుర్రాడు సరిగ్గా సాయంత్రం 6 గం. 58. ని. సమయంలో మాల్లోకి ప్రవేశించినట్టు వీడియోలో రికార్డయిందని చెబుతారు.
అతడిని పట్టుకునేందుకు భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. బెర్లింగ్టన్ నగరాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. అగంతుకుడి దాడిని ప్రత్యక్షంగా చూసినవారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ దాడి ఘటన ఇప్పుడు అమెరికాలో కలకలం రేపుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/